వెల్గటూర్, ఫిబ్రవరి 11. సీసీఐలో పత్తి కొనుగోలు చేయడం లేదని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని కొత్తపేట జిన్నింగ్ మిల్లు ముందు రహదారిపై పత్తి రైతులు ధర్నా(Farmers protest) చేపట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి గత రెండు రోజులగా ఇక్కడే ఉన్నప్పటికి సైట్ ప్రాబ్లం అని పత్తి కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయారు.
రైతుల ధర్నాతోభారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. ఎస్ఐ ఉమాసాగర్ రైతులను సముదాయించి ధర్నా నుంచి విరమింప చేశారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | ప్రతి మహిళకు రూ. 34,000 బాకీపడ్డ రేవంత్ సర్కార్ : ఎమ్మెల్సీ కవిత
Karimnagar | హనుమాన్ మాలధారణతో మోసం.. దొంగ బాబాకు దేహశుద్ధి