MLC Kavitha | ప్రతి మహిళకు రూ. 34,000 బాకీపడ్డ రేవంత్ సర్కార్ : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
MLC Kavitha | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని చేయాలని అల్టిమేటం జారీ చేశారు. మంగళవారం నాడు తెలంగాణ జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. మహిళలకు ఇచ్చిన హామీల పై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం విషయంలో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… కేసీఆర్ పాలనలో మహిళలకు పెద్దపీట వేశామని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. మాయ మాటలు చెప్పి, అబద్ధపు హామీలు ఇచ్చి మహిళలను రేవంత్ రెడ్డి మోసం చేశారని విరుచుకుపడ్డారు. “ప్రతి మహిళకు నెలకు 2500 చొప్పున డబ్బులు అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 14 నెలలు గెలిచినా కూడా అమలు చేయకపోవడం దారుణం. 14 నెలల డబ్బు రూ. 34,000 కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బాకీ పడింది. మహిళా దినోత్సవం లోపు ఈ హామీని నెరవేర్చాలి” అని డిమాండ్ చేశారు.
కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ, ఆడపిల్లలందరికీ ఉచితంగా స్కూటీలు అందిస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు. మహిళలకు ఉచిత బస్సు పెట్టి మిగతా పథకాలను తుస్సుమనిపించారని ఎద్దేవా చేశారు. తాము మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని, కానీ ప్రభుత్వం మరిన్ని బస్సులు పెంచి ప్రజా రవాణాను సులభతరం చేయాలని సూచించారు. కేవలం మహిళలనే కాకుండా అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. మహిళల పేరిట ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఆ ప్రక్రియనే మొదలుపెట్టలేదని ఎత్తిచూపారు. సంక్రాంతికి సన్నబియ్యం ఇస్తామని ఇప్పటికీ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్లను తక్షణమే నాలుగు వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | సీఎం రేవంత్‌కు రేషం లేదు.. అందుకే దులుపుకుంటూ తిరుగుతున్నడు.. కేటీఆర్ సైటర్లు..!
KTR | ప్రజలు కాంగ్రెస్ నేతల గల్లాలు పట్టుకొని కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నయ్ : కేటీఆర్
Harish Rao | పరవళ్లు తొకుతున్న కాళేశ్వర జలాలు.. పంటలను చూసి పరవశించిన హరీశ్‌రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
Pakistan Astronaut: చైనా స్పేస్స్టేషన్కు వెళ్లనున్న పాకిస్థానీ ఆస్ట్రోనాట్
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

