Last Rites | కాంగ్రెస్ సర్పంచ్ హుకుం.. కుల బహిష్కరణకు గురైన వ్యక్తి పాడే మోసేందుకు రాని గ్రామస్తులు
Last Rites | కందనకుంట గ్రామానికి చెందిన ఎదుల రాజేశం కుటుంబాన్ని పెద్దలు కుల బహిష్కరణ చేశారు. అయితే రాజేశం మృతి చెందగా.. అతడి పాడె మోయకూడదని గ్రామ సర్పంచ్, కుల పెద్దలు హుకుం జారీ చేశారు.
Last Rites | ఓ కాంగ్రెస్ సర్పంచ్ సహా పెద్ద మనుషులు పైశాచికత్వాన్ని ప్రదర్శించి మానవత్వం మంటగలిసిపోయేలా ప్రవర్తించారు. కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనొద్దని గ్రామస్థులను, దూరపు బంధువులను ఆదేశించారు. ఈ అమానవీయ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో వెలుగుచూసింది.
కందనకుంట గ్రామానికి చెందిన ఎదుల రాజేశం కుటుంబాన్ని పెద్దలు కుల బహిష్కరణ చేశారు. అయితే రాజేశం మృతి చెందగా.. అతడి పాడె మోయకూడదని గ్రామ సర్పంచ్, కుల పెద్దలు హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజేశం పాడె మోయడానికి గ్రామస్తులెవరూ ముందుకు రాలేదు.
రాజేశం అంత్యక్రియలు సజావుగా సాగేందుకు కుటుంబసభ్యులు కాళ్లు మొక్కుతామని వేడుకున్నా కాంగ్రెస్ సర్పంచ్, పెద్ద మనుషులు కనికరించకలేదు. దీంతో చేసేదేమి లేక రాజేశం పాడెను అతడి భార్య, అక్కలు, కుటుంబసభ్యులు మోశారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాడె మోయడానికి ముందుకు రాని గ్రామస్థులు
గ్రామస్తులను, దూరపు చుట్టాలను పాడె మోయకూడదని ఆజ్ఞాపించిన కాంగ్రెస్ సర్పంచ్
కాళ్లు మొక్కుతామని వేడుకున్నా కనికరించని కాంగ్రెస్ సర్పంచ్, పెద్ద మనుషులు
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట… pic.twitter.com/5WCUsItLqn
— Telugu Scribe (@TeluguScribe) February 12, 2026
Read Also :
BRS | రాజేంద్ర నగర్‌ను హైదరాబాద్ కార్పొరేషన్లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకుల నిరసన
Attack | ప్రభుత్వ టీచర్‌పై కత్తితో దాడి.. నగల అపహరణ
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

