Cyber Criminals | కోరుట్ల, ఆగస్ట్ 6: విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల జిల్లా సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ, మెట్పల్లి డీఎస్పీ రాములు అన్నారు. బుధవారం కోరుట్ల పట్టణంలోని పీబీ గార్డెన్లో ట్రస్మా సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హజరైన సైబర్ క్రైమ్ డీఎస్పీ, మెట్పల్లి డీఎస్పీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్, సైబర్ స్టాకింగ్, వర్క్ ఫ్రం హోం పేరుతో మనల్ని ఆకర్షణకు గురి చేస్తారన్నారు. కొన్నిసార్లు భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు కాజేసేందుకు కుట్రలకు పాల్పడుతారని వారు పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. ఒకవేళ డబ్బులు నష్టపోతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. నేటి సమాజంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో నమోదు చేయొద్దని సూచించారు.
విద్యార్థులు బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలన్నారు. అమ్మాయిలు ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలన్నారు. ముఖ్యంగా విద్యార్థినిలు వాట్సాప్ డీపీలుగా తమ ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దన్నారు. సైబర్ క్రైమ్ నేరాలపై అప్రమత్తంగా ఉంటూ కుటుంబ సభ్యులను జాగృతం చేయాలని వారు కోరారు. అనంతరం సైబర్ క్రైమ్ ద్వారా జరిగే నేరాలను ఉదహరిస్తూ విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ చిరంజీవి, సైబర్ క్రైం ఎస్ఐలు కృష్ణ, దినేష్, పోలీస్ కళాజాత కళాకారులు, ట్రస్మా పట్టణాధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ బారీ, ప్రతినిదులు పోతని ప్రవీణ్ కుమార్, బండి మహదేవ్, కుడేల రాజేంద్ర ప్రసాద్, చౌట్ రమేష్, దీపక్, తదితరులు పాల్గొన్నారు.
Motkur : తెలంగాణ ఉద్యమ వైతాళికుడు జయశంకర్ సార్ : దూళిపాల ధనుంజయ నాయుడు
Raj B Shetty | పెద్ద స్టార్లతో నటిస్తే ఇబ్బందులు పడాలి.. రాజ్ బీ శెట్టి కామెంట్స్ వైరల్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలి : ఓరుగంటి రమణారావు