కమాన్ పూర్, ఫిబ్రవరి 09 : కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామంలో గల గత 400 సంవత్సరాల క్రితం వెలిసిన మల్లికార్జున స్వామి(Mallikarjuna Swamy temple) క్షేత్రంలో ఆదివారం అధిక సంఖ్యలో భక్త జనులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ఆవరణలో పట్నాలు వేసి, బోనాలు పోసి చెల్లింపులు చేశారు. శివసత్తులు పూనకాలతో హోరెత్తించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచే కాకుండా ఇక్కడకు దూర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రతి బుధ, ఆదివరాల్లో భక్త జనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మల్లిఖార్జున స్వామిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు.
ఇవి కూడా చదవండి..
Apurva Sammelanam | 40 సంవత్సరాల తర్వాత కలుసుకొని.. జ్ఞాపకాలు గుర్తుచేసుకొని
Mega Brothers | జిమ్లో మెగా బ్రదర్స్.. ఒకేచోట రామ్ చరణ్, వరుణ్, సాయి తేజ్