చింతలమానేపల్లి : ఆదిలాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాబాసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1983-1984లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం (Apurva Sammelanam ) నిర్వహించారు.ఈ అపూర్వ సమ్మేళనంలో 40 సంవత్సరాల తర్వాత ఒకే వేదిక పైకి చేరిన ఉపాధ్యాయులు,విద్యార్థులు తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఒకరినొకరు బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
విద్యా బుద్ధులు నేర్పిన గురువులను ( Teachers ) శాలువలతో సన్మానించి,జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు నగర స్వామి, మల్లయ్య, మురళీధర్ రావు, ప్రభాకర్ రావు, హనుమంత రెడ్డి, షఫీ హైమద్, పూర్వ విద్యార్థులు రూపాచారి,శ్యాంరావు, శ్రీనివాస్, పర్శ చంద్ర శేఖర్,డుబ్బుల నానయ్య, ఎల్ములే మల్లయ్య, మస్కుర్,డోకె నారాయణ, సత్పుతే తుకారాం, రౌతు చరoదాస్,నాందేవ్, దేవాజీ, మోతీరాం, తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం