Ram Charan – Varun Tej, Sai Tej | సినిమాల విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్‌తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆర్సీ16 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రాబోతుంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. ఇటీవల మట్కా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో డిజాస్టార్‌ను అందుకున్నాడు. ఈ మధ్య వరుణ్ తేజ్ సినిమాలు చూస్తుంటే ప్లాఫ్‌లే లక్ష్యంగా సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక యాక్షన్, లవ్, పీరియాడిక్ జానర్లతో డిజాస్టార్లను అందుకున్న వరుణ్ తనకు అచ్చోచ్చిన కామెడీ జానర్‌ను మళ్లీ నమ్ముకున్నాడు. వెంకట్రాది ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో హిట్లు అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీతో వరుణ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
సాయి ధరమ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు అనే యాక్షన్ ఎంటర్టైన్లో నటించబోతున్నాడు. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు.