శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 02, 2020 , 03:41:39

వైద్యులకు గవర్నర్ శుభాకాంక్షలు

వైద్యులకు గవర్నర్ శుభాకాంక్షలు

కరీంనగర్ హెల్త్ : ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డితో వీడియో కాల్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్-19లో ఫ్రంట్ లైన్‌లో పని చేస్తున్న వైద్యుల సేవలు అభినందనీయమని ప్రశంసించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా నియంత్రణకు  ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, చేతులను తరచూ శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రజలు  సమతుల్య ఆహారం తీసుకోవాలన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు ఐక్యంగా పని చేస్తున్నారన్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో టెలీమెడిసిన్ ఏర్పాటు చేశామన్నారు. 


logo