లండన్: క్రికెట్లో ఎన్నో రికార్డులు వస్తుంటాయి. పోతుంటాయి. అసలు రికార్డులు ఉన్నవే పడగొట్టడానికి అంటారు. కానీ 17 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు (ఏప్రిల్ 12) నమోదైన ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఎవరూ కనీసం దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లని రికార్డు అది. వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ బ్రయాన్ చార్లెస్ లారా ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన వరల్డ్ రికార్డు అది. 2004, ఏప్రిల్ 10 నుంచి 14 మధ్య ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లారా ఈ కనివినీ ఎరగని రికార్డును క్రియేట్ చేశాడు.
అంతకు కేవలం ఆరు నెలల ముందే తన 375 వరల్డ్ రికార్డును బీట్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మాథ్యూ హేడెన్ (380) నుంచి మళ్లీ రికార్డును లాగేసుకోవడం లారాకే చెల్లింది. 1994లో ఇదే ఇంగ్లండ్‌పై 375 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు బ్రియాన్ లారా. పదేళ్ల పాటు పదిలంగా ఉన్న ఆ రికార్డును జింబాబ్వేపై హేడెన్ తిరగరాశాడు. కానీ ఆ సంతోషం, రికార్డు ఎక్కువ కాలం నిలవలేదు.
13 గంటల మారథాన్ ఇన్నింగ్స్
2004లో ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ సందర్భంగా పటిష్ఠమైన స్టీవ్ హార్మిసన్, ఆండ్రూ ఫ్లింటాఫ్, మాథ్యూ హోగార్డ్ల బౌలింగ్ అటాక్‌ను తుత్తునియలు చేస్తూ లారా ఈ మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 13 గంటల పాటు క్రీజులో గడిపిన లారా చివరికి 582 బంతుల్లో 43 ఫోర్లు, 4 సిక్సర్లతో అసాధ్యమనుకున్న 400 పరుగుల రికార్డును అందుకున్నాడు. నాలుగో టెస్ట్ మూడో రోజు ఆట ఈ చిరస్మరణీయమైన రికార్డుకు వేదికైంది.
2019లో మాత్రం ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ఈ లారా రికార్డును బ్రేక్ చేస్తాడా అనిపించింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వార్నర్ 335 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అదే సమయంలో కెప్టెన్ టిమ్ పైన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో వార్నర్ ఆ రికార్డుకు 65 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 1990లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన బ్రియాన్ లారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 501 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రికార్డును కూడా తన పేరిటే రాసుకున్నాడు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్లో నైట్‌రైడర్స్ 100వ విజయం.. షారుక్‌ఖాన్ రియాక్షన్ ఇదీ
రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌కు బాఫ్టా నివాళులు
కొవిడ్ భయాలు.. దారుణంగా పతనమైన స్టాక్ మార్కెట్
కరోనా కల్లోలం.. ఇండియాలో కొత్తగా 1.69 లక్షల కేసులు
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
బెస్ట్ డైరక్టర్ జావో.. నోమాడ్‌ల్యాండ్‌కు నాలుగు బాఫ్టా అవార్డులు
కుంభమేళా.. కొవిడ్ నిబంధనలు పాటించని భక్తులు
బాఫ్టా అవార్డ్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రియాంక చోప్రా, నిక్