e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home News బెస్ట్ డైర‌క్ట‌ర్ జావో.. నోమాడ్‌ల్యాండ్‌కు నాలుగు బాఫ్టా అవార్డులు

బెస్ట్ డైర‌క్ట‌ర్ జావో.. నోమాడ్‌ల్యాండ్‌కు నాలుగు బాఫ్టా అవార్డులు

బెస్ట్ డైర‌క్ట‌ర్ జావో..  నోమాడ్‌ల్యాండ్‌కు నాలుగు బాఫ్టా అవార్డులు

లండ‌న్‌: బ్రిటీష్ ఫిల్మ్ అవార్డ్స్ బాఫ్టా వేడుక‌లు.. ఆదివారం రాత్రి వ‌ర్చువ‌ల్‌గా జ‌రిగాయి. అమెరికా నేప‌థ్యంలో తీసిన నోమాడ్‌‌ల్యాండ్ సినిమాకు నాలుగు బాఫ్టా అవార్డులు ద‌క్కాయి. బెస్ట్ డైర‌క్ట‌ర్ అవార్డు చొలే జావోకు వెళ్లింది. నోమాడ్‌ల్యాండ్ సినిమాను ఆమే డైర‌క్ట్ చేసింది. ఈ సినిమాకు బెస్ట్ యాక్ట్రెస్‌, బెస్ట్ ఫిల్మ్ అవార్డులు కూడా ద‌క్కాయి. ఈసారి బాఫ్టాలో మ‌హిళా డైర‌క్ట‌ర్ల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొన్న‌ది. ప‌శ్చిమ అమెరికా ప్రాంతంలో వ్యాన్‌లో జీవించే ఓ మ‌హిళ జీవిత క‌థ‌ను నోమాడ్‌ల్యాండ్‌లో చిత్రీక‌రించారు. ఆ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించిన ఫ్రాన్సిస్ మెక్ డార్మాండ్‌కు బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు ద‌క్కింది. బాఫ్టా చ‌రిత్ర‌లో ఓ మ‌హిళా డైర‌క్ట‌ర్‌కు అవార్డు ద‌క్క‌డం గ‌త 53 ఏళ్ల‌లో ఇది రెండ‌వ సారి మాత్ర‌మే.

ఇక బెస్ట్ యాక్ట‌ర్ అవార్డును ఆంధోనీ హాప్కిన్స్ గెలుచుకున్నారు. ద ఫాద‌ర్ చిత్రంలో ఆయ‌న‌కు ఈ అవార్డు ద‌క్కింది. 27 ఏళ్ల క్రితం బాఫ్టాలో అవార్డు గెలిచిన ఆయ‌న ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు అవార్డును ఎగురేసుకుపోయారు. 83 ఏళ్ల వ‌య‌సులో ఆంధోనీ హాప్కిన్స్ అవార్డు గెలుచుకోవ‌డం విశేషం. ఈ అవార్డును అందుకున్న అత్యంత వృద్ధుడు ఆయ‌నే.

Advertisement
బెస్ట్ డైర‌క్ట‌ర్ జావో..  నోమాడ్‌ల్యాండ్‌కు నాలుగు బాఫ్టా అవార్డులు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement