మంగళవారం 04 ఆగస్టు 2020
Kamareddy - Jul 06, 2020 , 02:26:24

కొనసాగుతున్న ‘హరితహారం’

కొనసాగుతున్న ‘హరితహారం’

గాంధారి/విద్యానగర్‌/ బీబీపేట్‌/ నాగిరెడ్డిపేట్‌/పిట్లం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లాలోని పలు మండలాలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం మొక్కలను నాటారు. పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు మొక్కలను పంపిణీ చేశారు. 

గాంధారి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో జడ్పీటీసీ సభ్యుడు శంకర్‌నాయక్‌ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలను నాటారు. నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాధాబలరాం, సర్పంచ్‌ సంజీవ్‌, ఏఎంసీ చైర్మన్‌ పెద్దబూరి సత్యం, వైస్‌ ఎంపీపీ భజన్‌లాల్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ వంజరి శంకర్‌, గాంధారి విండో చైర్మన్‌ పెద్దబూరి సాయికుమార్‌, ప్రిన్సిపాల్‌ శిల్ప, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న రాశివనంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు మొక్కలను నాటారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, సెక్రటరీ సునీల్‌కుమార్‌, కోశాధికారి గంగాధర్‌, రాజన్న, శ్యాంగోపాల్‌, రఘుకుమార్‌, పంపరి శ్రీనివాస్‌, శేఖర్‌ పాల్గొన్నారు. బీబీపేట్‌ మండలం కోనాపూర్‌ గ్రామస్తులకు సర్పంచ్‌ నర్సవ్వ ఉపసర్పంచ్‌ స్వామి, పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామితో కలిసి మొక్కలను పంపిణీ చేశారు. నాగిరెడ్డిపేట్‌ మండలం చీనూర్‌ గ్రామస్తులకు సర్పంచ్‌ సౌందర్య మొక్కలను పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ ఇండ్ల ఆవరణలో మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు. ఆమె వెంట వార్డుసభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. పిట్లం మండలం హరిజనవాడలో సర్పంచ్‌ విజయలక్ష్మి మొక్కలను పంపిణీ చేశారు. ఇంటికి ఆరుమొక్కల చొప్పున పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ఇబ్రహీం, పంచాయతీ కార్యదర్శి విఠల్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు అంబదాస్‌, బాలరాజ్‌ పాల్గొన్నారు. logo