సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Nov 25, 2020 , 06:47:44

యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి

యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి

  • సందీప్‌కుమార్‌ సుల్తానియా

జయశంకర్‌ భూపాలపల్లి, నమస్తేతెలంగాణ : పల్లె ప్రగతి అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా అధికారులను ఆదే శించారు. జెన్‌కో గోదావరి అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ జిల్లాలో 45 రైతు వేదికలకు, నాలుగు మినహా మిగతావి దాదాపు పూర్తయ్యాయని, కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటిని పూర్తి చేయించాలని అన్నారు. 383 గ్రామాల్లో డిసెంబర్‌ 7వ తేదీ లోగా పల్లె ప్రకృతి వనాలను కంప్లీట్‌ చేయాలని సూచించారు. నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 241 సెగ్రిగేషన్‌ షెడ్లను వాడాలని సూచించారు. డిసెంబర్‌ 31లోగా వైకుంఠ ధామాల నిర్మాణాలను  పూర్తి చేసి నీటి వసతిని కల్పించాలని అన్నారు. ప్రతి రోజు జీపీలో 50 మందికి తగ్గకుండా ఉపాధి కూలీలు  పని చేసేలా చూడాలని అన్నారు. నర్సరీల ఏర్పాటుకు బ్యాగ్‌ ఫిల్లింగ్‌ వేగిరం చేయాలని సూచించారు. మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు వారానికి ఒకసారైనా గ్రామాల్లో పర్యటించి ఐకేపీ సీసీలతో బ్యాంక్‌ లింకేజీ రుణాల మంజూరుపై  సమీక్షించాలని అన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, పీఆర్‌ ఈఎన్సీ సంజీవరావు, ములుగు జిల్లా అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, పీఆర్‌ ఈఈ రాంబాబు, డీపీవో సుధీర్‌కుమార్‌, డీఆర్డీవో శైలజ, జడ్పీ సీఈవో నాగపద్మజ, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్లు, ఇంజినీర్లు పాల్గొన్నారు. 

VIDEOS

logo