బ్లాక్ ఫంగస్ ఓ కొత్త సవాల్ : ప్రధాని మోదీ

వారణాసి : ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల గురించి అక్కడి డాక్టర్లు, ప్యారామెడికల్ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో ప్రధాని మోదీ ఇవాళ వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్19పై పోరాడుతున్న సమయంలో.. బ్లాక్ ఫంగస్ రూపంలో కొత్త సవాల్ ఎదురైందని, ఆ వ్యాధిని అరికట్టేందుకు, అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకునే రీతిలో దృష్టి పెట్టాలన్నారు. వ్యాక్సినేషన్ వల్ల ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రక్షణ కలిగిందని, వారంతా ప్రజా సేవ చేస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికీ కోవిడ్ టీకాలను ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. జహా బీమార్.. వహా ఉపచార్ అన్న విధానాన్ని అవలంబిస్తూ.. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి మందులు అందిస్తున్న తీరు ప్రశంసనీయమన్నారు. పండిట్ రాజన్ మిశ్రా కోవిడ్ హాస్పిటల్‌ను వారణాసిలో ఏర్పాటు చేసిన తీరు అద్భుతమన్నారు. ఆ హాస్పిటల్లో చాలా వేగంగా ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లను పెంచినట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

