ఆదివారం 07 మార్చి 2021
International - Jan 19, 2021 , 03:25:15

రష్యా ప్రతిపక్షనేత అరెస్టు

రష్యా ప్రతిపక్షనేత అరెస్టు

మాస్కో: రష్యా ప్రతిపక్ష నాయకుడు ఆలెక్సీ నావల్నీని ఆ దేశ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మాస్కో విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. 5 నెలల క్రితం నావల్నీపై విష ప్రయోగం జరిగింది. దీంతో జర్మనీలో చికిత్స తీసుకున్న ఆయన రష్యాకు తిరిగి వచ్చారు.  విష ప్రయోగం వెనుక అధ్యక్షుడు పుతిన్‌ హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 2014లో నమోదైన నిధుల దుర్వినియోగం తదితర కేసులపై విచారణ కోసమే నావల్నీని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. 

VIDEOS

logo