హైదరాబాద్ : నగరంలో వేర్వేరు చోట్ల రెండు కార్లు(Car accident) దగ్ధమయ్యాయి. వనస్థలిపురం పరిధి గుర్రంగూడ(Gurram guda) వద్ద కారు దగ్ధమైంది. కారులో నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారులోంచి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోక సంఘటనలో గచ్చిగౌలి ఔటర్ రింగ్‌రోడ్డు(Outer Ring Road) వద్ద కారులో మంటలు చోటు చేసుకున్నాయి.
శిల్పా ఫ్లైఓవర్(Shilpa flyover) వద్ద కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.