ముషీరాబాద్, ఫిబ్రవరి 23 : నాగర్‌కర్నూల్ జిల్లాలోని కుమ్మెర జాతరలో పసికందు హత్య, రజక దంపతులపై జరిగిన దాడి ఘటనపై ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. కుమ్మెరలో అగ్రకులానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, మాధవరెడ్డి, సతీశ్‌రెడ్డి కర్కషంగా దాడి చేసి చిన్నారి మృతికి కారకులయ్యారని ఆరోపించారు. ఆల య దర్శనం కోసం వచ్చిన రజక దంపతులను టికెట్ లేదనే కారణం తో వారు గుడిలోకి రానివ్వలేదని, కాళ్లపై పడి దండం పెట్టినా ఆ దంపతులను విక్షణారహింతంగా కొట్టారని తెలిపారు.
వారి పసి బిడ్డను కాళ్లతో తన్ని విసిరేసి చిన్నారి చావుకు కారకులయ్యారని మండిపడ్డారు. బాధితలకు న్యాయం చేయాల్సిన పోలీసు లు.. అగ్రకుల పెత్తందారులకే వంతపాడుతున్నారని విమర్శించారు. బీసీలపై దాడులు చేసి, చిన్నారి హత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చాక బీసీలపై దాడులు, దౌర్జాన్యాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం వర్కింగ్ పెంసిడెంట్ ర్యాగ అరుణ్‌కుమార్, బీసీ సంక్షేమ సం ఘం నాయకులు నీల వెంకటేశ్, జిల్లపల్లి అంజి, డాక్టర్ చంద్రశేఖర్, పగిళ్ల సతీశ్, అనంతయ్య, సీ రాజేందర్, మోడీ రామ్‌దేవ్ పాల్గొన్నారు.