PM Modi : దేశంలోని ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల హక్కులను కాలేరాసే కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆరోపించారు. యూపీలోని ఆగ్రాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల హక్కులను లాగేసుకుందని, ఆపై దేశవ్యాప్తంగా ఎక్కడ అధికారంలోకి వచ్చినా ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలను వంచించేందుకు అలాగే చేయాలని భావిస్తోందని ఆరోపించారు.
కర్నాటకలో ముస్లింలందరినీ ఓబీసీ జాబితాలో చేర్చుతూ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుందని వివరంచారు. కాంగ్రెస్ ఓబీసీల హక్కులను కాలరాసిందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
యూపీలోనూ ఈ క్రీడను రక్తికట్టించేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోందని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడ అవకాశం వచ్చినా కాంగ్రెస్ ఈ పనికి తెగబడుతుందని అన్నారు. దొడ్డిదారిన ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు కోతలు పెట్టి దాన్ని ఇతరులకు బీజేపీ అందిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఈ క్రమంలో సమాజ్వాదీ పార్టీ పూర్తిగా వత్తాసు పలుకుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Read More :
BJP | మారనున్న పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి.. వెంకటేశ్ నేతకు టికెట్?