బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Aug 11, 2020 , 08:01:55

కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి సాయం చేస్తా : వోల్కన్‌ బోజ్కిర్‌

కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి సాయం చేస్తా :  వోల్కన్‌ బోజ్కిర్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌, భారత్‌ కలిసి విజ్ఞప్తి చేస్తే తన పరిధిలో కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి సాయం చేసేందుకు సిద్ధమని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైన వోల్కన్‌ బోజ్కిర్‌‌ తెలిపారు. సోమవారం పాక్‌ విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీతో కలిసి వోల్కన్‌ బోజ్కిర్‌‌ మీడియాతో మాట్లాడారు. దక్షిణాసియా ప్రాంతంలో శాంతి సాధనకు కశ్మీర్‌ అంశం చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే కశ్మర్‌ అంశం తమ రెండు దేశాల ద్వైపాక్షిక అంశమని, తృతీయ పక్షం జోక్యం తమకు అవసరం లేదని భారత్‌ తొలి నుంచి చెబుతున్నది. 

తాజావార్తలు


logo