సూర్యాపేట: జిల్లాలోని చివ్వెంల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని గుంజలూరు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి సమన్వి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో దవాఖానకు తరలించారు. బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..