రోమ్ : (G-20 Summit) ఇటలీ రాజధాని రోమ్‌లో జరుగుతున్న జీ-20 సదస్సు సందర్భంగా వివిధ దేశాల అధినేతలతో భారతదేశం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పాటు పలువురు ప్రపంచ నేతలతో శనివారం భేటీ అయ్యారు. జో బైడెన్‌తో నవ్వుకుంటూ చిన్నపాటి చర్చను మోదీ జరిపారు. అదేవిధంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను ఆలింగనం చేసుకుని చలోక్తులు విసురుకున్నారు. కెనడియన్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో యానిమేషన్ చర్చలో పాల్గొన్నారు. అంతకుముందు జీ-20 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీని రోమ్ కన్వెన్షన్ సెంటర్ వద్దకు చేరుకోగానే ఇటలీ ప్రధాని మారియో డ్రాగియస్ ఆత్మీయ స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లారు.
శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సింగపూర్ ప్రధాని లీ సియన్ లుంగ్తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. వీరి భేటీలో కేంద్ర విదేశాంగ మంద్రి ఎస్ జైశంకర్, ప్రభుత్వ సలహాదారు అజిత్‌దోవల్ కూడా ఉన్నారు. రోమా కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న జీ-20 సమ్మిట్ సందర్భంగా ‘గ్లోబల్ ఎకానమీ అండ్ గ్లోబల్ హెల్త్’ అనే అంశంపై జరిగిన సెషన్లో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఇతర ప్రపంచ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఫొటో సెషన్లో పాల్గొన్నారు. ఈ ఫొటో సెషన్లో పలువురు ఫ్రంట్‌లైన్ కార్యకర్తలు కూడా పాల్గొనడం విశేషం. జీ-20 రోమ్ సమ్మిట్ సందర్భంగా ప్రపంచ నేతలు 2022 మధ్య నాటికి ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి టీకాలు వేయడంపై యోచించనున్నారు. అదేవిధంగా వాతావరణ మార్పుల గురించి కూడా చర్చిస్తారని భావిస్తున్నారు.
#WATCH Prime Minister Narendra Modi arrives at G20 Summit venue in Rome. He is received by Italian Prime Minister Mario Draghi pic.twitter.com/Xlf97TgIUS
— ANI (@ANI) October 30, 2021
ఇకపై జూలై 18 తమిళనాడు దినం : ప్రకటించిన సీఎం స్టాలిన్
ఆ 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చాలి..!
అన్నదాతల అభివృద్ధితోనే దేశాభివృద్ధి : వెంకయ్యనాయుడు
అవినీతి, కుంభకోణానికి పర్యాయపదం కాంగ్రెస్ : అమిత్‌షా
ఆ రైతులకు అండగా టీటీడీ : చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య
సమాజ్‌వాది పార్టీలో చేరిన బీఎస్పీ, బీజేపీ ఎమ్మెల్యేలు
అనారోగ్యంతో భార్య మృతి.. తట్టుకోలేక భర్త కన్నుమూత
తిరుమల ఘాట్‌లో ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రారంభించనున్న సీఎం జగన్
బద్వేలులో ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..