Samajwadi Party : సమాజ్‌వాది పార్టీలో చేరిన బీఎస్పీ, బీజేపీ ఎమ్మెల్యేలు
Samajwadi Party : తాజాగా బీఎస్పీ, బీజేపీ ఎమ్మెల్యేలు సైకిలెక్కారు. బీఎస్పీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆరుగురు ఎమ్మెల్యేలతోపాటు బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కూడా...

లక్నో : (Samajwadi Party) అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కప్ప దుంకుడులు ప్రారంభమవగా.. తాజాగా బీఎస్పీ, బీజేపీ ఎమ్మెల్యేలు సైకిలెక్కారు. బీఎస్పీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆరుగురు ఎమ్మెల్యేలతోపాటు బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కూడా అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఎస్పీలో చేరిన ఎమ్మెల్యేలలో బీఎస్పీ నుంచి సస్పెండైన హరగోవింద్ భార్గవ్, ముజ్తబా సిద్ధిఖీ, హకీమ్ లాల్ బింద్, అస్లాం రైనీ, సుష్మా పటేల్, అస్లాం చౌదరి, బీజేపీ నుంచి సీతాపూర్ ఎమ్మెల్యే రాకేశ్ రాథోడ్ ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం.
గత ఏడాది జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్ బయటపడిన తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి మాయావతి సస్పెండ్ చేశారు. వీరంతా అఖిలేష్ యాదవ్‌ను కలిసి ఎస్పీకి మద్దతు ప్రకటించారు. తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను ఎస్పీలో చేర్చుకోవడంపై మాయావతి మండిపడ్డారు. ఇది అఖిలేష్ ఆడుతున్న “డ్రామా” అని వ్యాఖ్యానించారు. ‘సమాజ్‌వాది పార్టీతోపాటు ఓ పారిశ్రామికవేత్తతో కుమ్మక్కైన వీరంతా తాము నిలిపిన దళిత అభ్యర్థిని రాజ్యసభ ఎన్నికల్లో ఓడించారు. అందుకే వీరిని చాలా కాలం క్రితం బీఎస్పీ నుంచి సస్పెండ్ చేశాం’ అని బీఎస్పీ అధినేత ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
అనారోగ్యంతో భార్య మృతి.. తట్టుకోలేక భర్త కన్నుమూత
తిరుమల ఘాట్‌లో ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రారంభించనున్న సీఎం జగన్
బద్వేలులో ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్
నవంబర్ 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?!
కాటరాక్ట్ ఉన్నవారిలో గుండె జబ్బులు ఎక్కువ : ఆస్ట్రేలియా పరిశోధకులు
మయన్మార్‌లో 100 మిలియన్ సంవత్సరాల వయస్సు పీత శిలాజం గుర్తింపు
వడోదరలో ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

