Oldest Crab: మయన్మార్‌లో 100 మిలియన్ సంవత్సరాల వయస్సు పీత శిలాజం గుర్తింపు
Oldest Crab : మయన్మార్‌లో 100 మిలియన్ సంవత్సరాల వయస్సు గల పీత శిలాజాన్ని కనుగొన్నారు. కళ్ళు, నోరుతోపాటు శరీరంపై వెంట్రుకలు చెక్కుచెదరకుండా...

నైపిటావ్ : (Oldest Crab) మయన్మార్‌లో 100 మిలియన్ సంవత్సరాల వయస్సు గల పీత శిలాజాన్ని కనుగొన్నారు. కళ్ళు, నోరుతోపాటు శరీరంపై వెంట్రుకలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. 55 మిల్లీమీటర్ల పొడవున్న ఈ పీతను మొక్కల బెరడు నుంచి విడుదలయ్యే పసుపు రంగులోని పారదర్శక, జిగట పదార్థంలో భద్రపరిచినట్లు పరిశోధనలో పాల్గొన్న హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు జేవియర్ లూక్ తెలిపారు. ఈ శిలాజం ద్వారా పీతలు ఎలా అభివృద్ధి చెందాయి? ప్రపంచంలో ఎలా వ్యాపించాయి? అనే విషయాల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు వీలుచిక్కనున్నది.
ఈ పీత పూర్వీక జాతులు సముద్రం నీటిలో నివసించేవని దీని డీఎన్ఏ విశ్లేషణ రిపోర్ట్ చెప్తున్నది. 2015లో దొరికిన ఈ పీత.. దీన్ని చైనాలోని లాంగ్యిన్ అంబర్ మ్యూజియంలో ఉంచారు. దీనిపై హార్వర్డ్ బృందం పరిశోధనలు చేయడంతో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పీత శిలాజానికి కాటప్సర అథంత అని పేరు పెట్టారు. మైకో-సీటీ స్కాన్ ద్వారా దీనిని పరిశీలించినట్లు జేవియర్ లూక్ చెప్పారు. మైకో-సీటీ స్కాన్ సాయంతో పీత యాంటెన్నా, కాళ్ళు, నోటి భాగాలు, జుట్టు, కళ్ళను పరిశీలించారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 100 మిలియన్ సంవత్సరాల తర్వాత కూడా ఈ పీత శరీరంపై ఉన్న ప్రతి ఒక్క వెంట్రుక దాని స్థానంలో అలాగే ఉన్నది. శరీరంలోని ఏ భాగం కూడా వేరుకాలేదు. ఈ పీత పూర్తిగా సముద్రంలో లేదా భూమిపై నివసించదని పరిశోధకులు చెప్తున్నారు. సముద్రంలో పిల్లలకు జన్మనిచ్చేవని, తర్వాత క్రమంగా భూమికి వచ్చినట్లు పరిశోధకులు నమ్ముతున్నారు. మయన్మార్‌లో కనుగొన్న పీత నీటిలో, భూమిపై నివసించినట్లు తెలుస్తున్నదని జేవియర్ లూక్ తెలిపారు. ఇవి క్రిస్ట్మస్ ఐల్యాండ్ రెడ్ క్రాబ్లతో పోలికను కలిగి ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
ఉన్నత విద్యలో బహుముఖ విధానాలు అవసరం: వెంకయ్యనాయుడు
వడోదరలో ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్ ప్రారంభం
చైనా హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష నిజమే సుమా: అమెరికా
మోదీ బలం అర్థం చేసుకుంటేనే.. బీజేపీని ఓడించొచ్చు: ప్రశాంత్ కిషోర్
ఈ పరీక్షతో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించొచ్చు.. ఎడిన్బర్గ్ పరిశోధకుల అభివృద్ధి
మడగాస్కర్ అడవుల్లో బుల్లి ఊసరవెల్లి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

