Blood clots new test : ఈ పరీక్షతో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించొచ్చు.. ఎడిన్బర్గ్ పరిశోధకుల అభివృద్ధి
Blood clots new test : శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త పరీక్షను అభివృద్ధి చేశారు. ఒక రకమైన రంగు సాయంతో శరీరంలోని ఏ భాగంలో రక్తం గడ్డకట్టిందో ...

ఎడిన్బర్గ్ : (Blood clots new test) శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త పరీక్షను అభివృద్ధి చేశారు. ఒక రకమైన రంగు సాయంతో శరీరంలోని ఏ భాగంలో రక్తం గడ్డకట్టిందో తెలుసుకోవచ్చు. శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ కొత్త పరీక్ష సహాయంతో గుండె వెలుపలి రక్తంలో రక్తం గడ్డకట్టడాన్ని గమనించవచ్చని ఈ పరిశోధన నిర్వహించిన ఎడిన్బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనను ‘యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ’లో ప్రచురించారు. ఈ పరీక్ష త్వరలో బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ ద్వారా సాధారణ ప్రజలకు అందుబాటులోకా రానున్నది. దీని ద్వారా బ్రిటన్‌లో గుండె జబ్బులతో బాధపడుతున్న 80 లక్షల మందిలో ప్రమాదాన్ని అంచనా వేసే వీలు చిక్కుతుంది.
శరీరంలో ఎక్కడ రక్తం గడ్డకడుతుందో ఆ భాగంలోని ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినట్లు ఎడిన్బర్గ్ యూనివర్శిటీ పరిశోధకులు చెప్తున్నారు. ఇలా అడ్డంకులు ఏర్పడటం వల్ల ధమనులు దెబ్బతింటాయి. ఈ కొత్త పరిశోధన ఇన్వెస్టిగేషన్ కోసం పరిశోధకులు 94 మంది రోగులను ఎంపిక చేశారు. ఈ రోగుల చేతుల్లోకి డై ఇంజెక్ట్ చేశారు. ఈ రంగు రక్తంలో కలిసిపోయి శరీరమంతా వ్యాపిస్తుంది. ధమనుల్లో ఎక్కడ దెబ్బతింటే అక్కడ రంగు చేరి ఒక రకమైన కాంతిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కాంతిని అల్ట్రా స్కాన్ ద్వారా వీక్షించవచ్చు.
యాంజియోగ్రామ్ కంటే ఉత్తమం..
రక్తం గడ్డకట్టడాన్ని ముందుగా గుర్తిస్తే గుండెపోటు ముప్పును తగ్గించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. యాంజియోగ్రామ్ కంటే ఈ కొత్త పరీక్ష విధానం సురక్షితమైనదని పరిశోధకులు అంటున్నారు. యాంజియోగ్రామ్‌లో గుండె చుట్టూ ఉన్న ధమనుల్లో అడ్డంకులు, నష్టాలను గుర్తించడానికి ట్యూబ్‌ను ఉపయోగిస్తారు. యాంజియోగ్రామ్‌లు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. కొత్త పరీక్షలతె ఈ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చునని సెలవిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా 80 శాతం వరకు ప్రమాదకరమైన రక్తం గడ్డకట్టడాన్ని కనుగొనవచ్చు. అదే రోగుల యాంజియోగ్రామ్‌లో 60 శాతం మాత్రమే గడ్డకట్టడం గుర్తించే వీలుంటుంది.
ఇవి కూడా చదవండి..
షోయాబ్ అక్తర్‌కు అవమానం.. లైవ్ షో నుంచి వెళ్లిపొమ్మన్న హోస్ట్.. ఎందుకంటే?
మడగాస్కర్ అడవుల్లో బుల్లి ఊసరవెల్లి
రామ్‌దేవ్ బాబాకు ఢిల్లీ కోర్టు సమన్లు
బ్రిటన్‌లో కొత్త ఫుడ్ ట్రెండ్ 5 : 2 .. వెజిటేరియన్ వైపు మొగ్గు
పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా చేయూత.. 300 కోట్ల ఆర్థిక సాయం ప్రకటన
ఆఫ్ఘనిస్తాన్‌లోనే ఇంకా 450 మంది అమెరికన్లు.. పెంటగాన్ వెల్లడి
పంజాబ్ రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా కెప్టెన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

