UK new trend : బ్రిటన్‌లో కొత్త ఫుడ్ ట్రెండ్ 5 : 2 .. వెజిటేరియన్ వైపు మొగ్గు
UK new trend : బ్రిటన్‌లో కొత్త ట్రెండ్ 5:2 డైట్ ప్రారంభమైంది. వారంలో 5 రోజులు శాఖాహారం, మిగతా 2 రోజులు నాన్ వెజ్ మాత్రమే తీసుకోవడమే ఈ కొత్త డైట్...

లండన్ : (UK new trend) బ్రిటన్‌లో కొత్త ట్రెండ్ 5:2 డైట్ ప్రారంభమైంది. వారంలో 5 రోజులు శాఖాహారం, మిగతా 2 రోజులు నాన్ వెజ్ మాత్రమే తీసుకోవడమే ఈ కొత్త డైట్ ఫార్మట్. అలాగే, బయటి ఫుడ్ కాకుండా ఇంట్లో వండిన ఆహారానికే బ్రిటీషర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. బ్రిటన్‌లో ఆహార మార్పుపై సూపర్ మార్కెట్ స్టోర్ వెయిట్రోస్ ఇటీవల విడుదల చేసిన ఫుడ్ అండ్ డ్రింక్ నివేదికలో ఇది వెల్లడైంది. గత ఏడాదిలో ఆహారంలో వచ్చిన మార్పులను అన్వేషించే ఈ నివేదిక.. బయట తినేందుకు ఇష్టపడే బ్రిటన్లు, కరోనా కారణంగా చాలా కాలం పాటు ఇంటి పట్టునే ఉన్నారని పేర్కొన్నది. అందుకే ఇంట్లోనే అద్భుతమైన వంటకాలు చేసి తిని ఆనందించడం మొదలుపెట్టారు. ప్రజలు కూడా తమకు ఇష్టమైన శాండ్విచ్లను ఆర్డర్ చేయడం మానేసి ఇంటి ఆహారాల వైపే మొగ్గు చూపారు.
బయటికెళ్లి తినడానికి బదులుగా ఇంట్లో చిన్న పార్టీల ట్రెండ్ పెరిగిపోయిందని కూడా ఈ నివేదికలో తేలింది. షాంపైన్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 40 శాతం పెరిగాయి. టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫాంలు కూడా ఇంట్లో తయారుచేసిన వంటకాలను తినమని ప్రజలను ప్రోత్సహించాయి. ఇంట్లోనే పాస్తా చిప్‌లను తయారుచేసే టిక్‌టాక్ ట్రెండ్ ఎయిర్ ఫ్రైయర్ల అమ్మకాలను 400 శాతం పెంచిందంట. వంటింటి చిట్కాల కోసం టిక్‌టాక్, యూట్యూబ్ సాయం తీసుకోవడం పెరిగిపోయిందంట. ఆన్లైన్ సెర్చ్‌లో కూడా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంపిక చేసుకోవడం కోసం చూస్తున్నారని నివేదిక పేర్కొన్నది.
పుచ్చకాయ వంటకాల కోసం వెయిట్రోస్ సైట్ బార్బెక్యూడ్లో సెర్చింగ్ 65 శాతం, నికర్‌బాకర్ గ్లోరీ ఐస్ క్రీమ్ డిష్ సెర్చింగ్‌లో 171 శాతం పెరుగుదల కనిపించింది. బియ్యం, వెనిగర్‌తో తయారు చేసే జపనీస్ వంటకం సుషీ అమ్మకాలు 54 శాతం పెరిగాయంట. మరోవైపు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల అమ్మకాలు 41 శాతం పెరిగాయి. ఇదే సమయంలో స్టోర్ రెడీమేడ్ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. వాతావరణ మార్పులపై ఈ నెల 31 నుంచి బ్రిటన్‌లో జరుగనున్న అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో, పర్యావరణ సమస్యలను తగ్గించేందుకు వారంలో కొన్ని రోజులు మాంసాహారం, పాల ఉత్పత్తులు తినొద్దని ఇటీవల బ్రిటన్ యువరాజు చార్లెస్ దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా చేయూత.. 300 కోట్ల ఆర్థిక సాయం ప్రకటన
ఆఫ్ఘనిస్తాన్‌లోనే ఇంకా 450 మంది అమెరికన్లు.. పెంటగాన్ వెల్లడి
పంజాబ్ రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా కెప్టెన్
ఇది లైవ్ బ్యాక్టీరియా క్లియర్ ఫొటో.. వెల్లడించిన యూకే శాస్త్రవేత్తలు
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

