Bacteria Clear Picture : ఇది లైవ్ బ్యాక్టీరియా క్లియర్ ఫొటో.. వెల్లడించిన యూకే శాస్త్రవేత్తలు
Bacteria Clear Picture : జీవించి ఉన్న బ్యాక్టీరియా స్పష్టమైన ఫొటోను శాస్త్రవేత్తలు అందించారు. ఈ బ్యాక్టీరియా పేరు గ్రామ్-నెగటివ్. దీనిని మందులతో తొలగించడం...

లండన్ : (Bacteria Clear Picture) జీవించి ఉన్న బ్యాక్టీరియా స్పష్టమైన ఫొటోను శాస్త్రవేత్తలు అందించారు. ఈ బ్యాక్టీరియా పేరు గ్రామ్-నెగటివ్. దీనిని మందులతో తొలగించడం కష్టంగా మారుతుందని, అయితే, సమర్థమైన యాంటీబయాటిక్స్ తయారీలో ఈ బ్యాక్టీరియా సహాయపడుతుందంటున్నారు పరిశోధకులు. ప్రొటీన్‌తో తయారైన ఈ బ్యాక్టీరియా బయటి పొర చాలా దట్టంగా ఉంటుందని ఈ ఫొటోను తీసిన యూకే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ఫొటో నుంచి భవిష్యత్‌లో అనేక విషయాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాక్టీరియా ఉపరితలంపై ఏర్పడిన రంధ్రాల సాయంతో పోషకాలు చేరి విషపూరిత మూలకాలు బయటకు వస్తాయని పరిశోధకులు గుర్తించారు.
ఈ బ్యాక్టీరియా ఫొటోను అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోపీతో తీయడం వల్ల దాని ఉపరితలాన్ని చాలా స్పష్టంగా చూడవచ్చని దీనిపై పరిశోధన చేసిన లండన్ యూనివర్సిటీ కాలేజ్‌కు చెందిన పరిశోధకుడు బార్ట్ హుగెన్బామ్ తెలిపారు. ఒక్క అమెరికాలోనే 28 లక్షల మంది యాంటీబయాటిక్-రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతున్నారని అమెరికా ఆరోగ్య సంస్థ సీడీసీ వెల్లడించింది.
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేందుకు ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల బ్యాక్టీరియాపై వాటి ప్రభావం మరింత తగ్గుతుందని సీడీసీ పేర్కొన్నది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మందిని చంపుతుంది. శాస్త్రవేత్తలు, వైద్యులు యాంటీబయాటిక్స్ దుర్వినియోగం గురించి ఆందోళన చెందుతున్నారు. గత మూడు దశాబ్దాలుగా కొత్త యాంటీబయాటిక్స్ కనుగొనకపోవడమే వీరి ఆందోళనకు కారణంగా చెప్పవచ్చు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో చిన్న చిన్న రోగాలు కూడా మనుషులకు ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
బందీపొరాలో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాద దాడి
జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లు ప్రారంభం
సూడాన్‌లో సైనిక తిరుగుబాటు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఏడుగురు మృతి
మీ ఎజెండాతో పార్టీకి నష్టం కలిగించకండి: సోనియాగాంధీ
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
గాయాల గురించి చెప్పే స్మార్ట్ బ్యాండేజ్ వచ్చేసింది..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

