Allergies : శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
Allergies : శీతాకాలం వచ్చిందంటే చాలు ఏదో ఒక అలర్జీ మనల్ని వేధిస్తుంటుంది. తుమ్ములు, దగ్గులే కాకుండా ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా...

(Allergies) శీతాకాలం వచ్చిందంటే చాలు ఏదో ఒక అలర్జీ మనల్ని వేధిస్తుంటుంది. తుమ్ములు, దగ్గులే కాకుండా ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. మన పరిసరాల్లోనే, మన ఇంట్లోనే అలర్జీ కలిగించే శత్రువు పొంచి ఉండొచ్చు. వాతావరణంలోని ధూళి, పూలు, పుప్పొడి, కాలుష్యం, కొన్నిరకాల వాసనలు, చల్లటి వాతావరణం.. ఇవన్నీ చూడడానికి ఏమంత ప్రమాదకరమైనవి కావు. అయినప్పటికీ కొంతమందిని తీవ్ర ఇబ్బంది పెట్టేస్తుంటాయి.
అలెర్జీ కేసులు శీతాకాలంలో 70 శాతం వరకు పెరుగుతాయి. ఒక వ్యక్తిలో అలెర్జీ కారకాలు రావడంతో ఆయన శరీరం హిస్టామిన్ రసాయనాన్ని రక్తంలోకి విడుదల చేసి.. తుమ్ములు, తలనొప్పికి కారణమవుతుంది. వాతావరణ మార్పులు శీతాకాలంలో ఎక్కువవుతుండటంతో అలర్జీ సమస్య అధికం అవుతుంది. కొన్ని జాగ్రత్తలు, నివారణ మరియు ఇమ్యునోథెరపీతో అలర్జీలను నయం చేయవచ్చు.
ఇవి పాటించండి..
- శరీరం మొత్తాన్ని కవర్ అయ్యేలా వెచ్చగా కప్పి ఉంచుకోవాలి.
- ఇంట్లో వాతావరణాన్ని కూడా వెచ్చగా ఉంచుకోవాలి.
- బ్యాక్టీరియా, వైరస్ చేరకుండా ఉండేందుకు మ్యాట్రస్, కార్పెట్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.
- శీతాకాలం పూర్తయ్యేంత వరకు పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి.
- దుమ్మును తుడిచేందుకు పొడి వస్త్రానికి బదులుగా తడి వస్త్రాన్ని ఉపయోగించాలి.
- దుస్తుల నుంచి సూక్ష్మక్రిములను తొలగించడానికి కనీసం 54 ° సెంటీగ్రేడ్ వేడి నీటిలో ఉతకాలిలి.
- ఎన్-95 లేదా ఎఫ్ఎఫ్పీ2 మాస్క్ ను విధిగా వాడటం అలవాటు చేసుకోవాలి.
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి..?
ముక్కు కారడం, కళ్లలో నీరు కారడం లేదా చాలా రోజుల పాటు నిరంతర దగ్గు ఉంటే అలర్జీ ఉన్నట్లు గుర్తించి వైద్యుడిని సంప్రదించాలి. ఈ లక్షణాల వల్ల నిద్ర పట్టకపోతే అప్రమత్తంగా ఉండాలి. సైనస్ ఇన్ఫెక్షన్, తలనొప్పి, చెవి ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఉంటే వైద్యుడి సలహాలు తీసుకోవాలి. అలెర్జీకి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం తీసుకోకూడదని గుర్తుంచుకోండి. వైద్యుల సలహాలు పాటించి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.
ఇవి కూడా చదవండి..
లఖింపూర్ ఖేరీ ఘటనలో మరో ముగ్గురు అరెస్ట్
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
ఫైజాబాద్ రైల్వేస్టేషన్ ఇక అయోధ్య కంటోన్మెంట్!
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా ఇస్కాన్ ప్రదర్శనలు
యాపిల్ దశ దిశను మార్చిన తొలి ఐపాడ్
జమ్ములో హోం మంత్రి పర్యటన.. అమరుల కుటుంబాలకు పరామర్శ
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

