Hi BP : హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
Hi BP : ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ శాతం మందిని ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్యల్లో హై బీపీ ఒకటి. హై బీపీ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అధిక రక్తపోటు వచ్చిన వారిలో...

(Hi BP) ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ శాతం మందిని ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్యల్లో హై బీపీ ఒకటి. హై బీపీ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అధిక రక్తపోటు వచ్చిన వారిలో రక్తనాళాల గోడలపై రక్తం తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంటుంది. రక్తపోటు 140/90 ఎంఎం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే హై బీపీగా పరిగణిస్తారు. రక్తపోటును నిర్లక్ష్యం చేసే వారిలో గుండె జబ్బులు, స్ట్రోక్స్ వచ్చేందుకు అవకాశాలుంటాయి. జన్యు కారకాలు, ఏరోబిక్ వ్యాయామాలు లేకపోవడం, గర్భ నియంత్రణ మాత్రలు వాడటం, ఒత్తిడి, మూత్రపిండాల వ్యాధి, నొప్పి నివారణ మాత్రలు మొదలైన కారణాల వల్ల కూడా అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యనిపుణులు చెప్తున్నారు.
కొందరు ఏ కారణం లేకుండానే హైపర్‌టెన్షన్ బారిప వడుతున్నారు. కొందరిలో 20 ఏండ్లు దాటగానే వంశపారంపర్యంగా హైపర్‌టెన్షన్ వచ్చే అవకాశమున్నది. పరీక్షలు చేస్తేగానీ బీపీ ఉన్నదనేది నిర్దారణ కాదు. యువతలో ఈ నమన్య ఎక్కువగా కనిపిస్తోంది. 20-30 ఏండ్ల వయస్సు వారిలో 5 శాతం, 30-40 ఏండ్ల వారిలో 10 శాతం, 40-50 ఏండ్ల వయస్సు వారిలో 5 శాతం, 50-60 ఏండ్ల వారిలో 15 శాతం మంది హైపెర్టెన్షన్తో బాధపడుతున్నారు. ప్రానెస్ ఫుడ్, పీజ్జాలు, బర్గర్లు, రెడీమేడ్ మాంసం, కూల్‌డ్రింక్‌లు, ప్రిజ్‌లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ఇటీవల ఎక్కువైంది. ఇలాంటి ఆహారాల్లో 20 శాతం ఉప్పు ఎక్కువగా ఉంటుంది. 15 శాతం ట్రాఫిక్‌లో తిరిగేవారిలో కూడా అధిక రక్తపోటు కనిపిస్తున్నదని వైద్యులు వెల్లడిస్తున్నారు.
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలు..
రక్తపోటు వచ్చిందని తెలిపే పలు లక్షణాలు మనకు ముందుగానే కనిపిస్తాయి. వాటిని గుర్తించి తగిన విధంగా చికిత్స తీసుకుంటే.. రక్తపోటు సమస్య నుంచి బయటపడొచ్చు.
- అధిక రక్తపోటు ఉంటే ముఖమంతా ఉబ్బిపోయినట్లు కనిపిస్తుంది. ముఖంలోని రక్తనాళాలు వెడల్పయి రక్తం ఎక్కువగా ప్రసరించడంతో ముఖం ఎర్రగా కనిపిస్తుంది.
- హైబీపీ ఉంటే మైకం కమ్మినట్లు అనిపిస్తుంది. మత్తుగా ఉంటారు. నిద్ర బాగా పోయినా సరే.. మత్తుగా ఉంటుంటే హైబీపీ అని అనుమానించాలి.
- బీపీ మరీ ఎక్కువగా ఉంటే కంటి చూపు సరిగ్గా ఉండదు. మసకగా కనిపిస్తుంది.
కంగారు, ఆందోళన, అలసట, నిద్రలేమి సమస్యలు ఉంటే హైబీపీగా అనుమానించాలి.
- ఛాతిలో నొప్పి వస్తుంటే దాన్ని హైబీపీగా అనుమానించాలి.
- బీపీ ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు ముక్కులోంచి రక్తం పడుతుంది. తలనొప్పి తీవ్రంగా ఉంటుంది.
- హైబీపీ ఉన్నవారికి కడుపులో వికారంగా అనిపిస్తుంది. మూత్రం తక్కువగా వస్తుంది. చేతులు, పాదాలు, ఇతర భాగాల్లో స్పర్శ కోల్పోయి మొద్దు బారినట్లు అనిపిస్తుంది.
- హైబీపీ ఎక్కువైతే కొందరికి మూర్ఛ కూడా వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా వస్తాయి.
ఇలా జాగ్రత్తపడండి..
- నిత్యం తప్పనిసరిగా 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
- ఎక్కువ సేపు కుర్చీకి అత్తుకుని కూర్చోకుండా చూసుకోవాలి.
- ఆహారంలో ఎక్కువ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.
- రెడ్ మీట్, మీగడ, వెన్న, నూనె ఆహారాలకు దూరంగా ఉండాలి.
- సిగరెట్, మద్యం సేవించే అలవాటును మానుకోవాలి.
ఇవి అలవాటు చేసుకోండి..
- నిమ్మరసం నిత్యం తీసుకోవాలి.
- శరీరం డీహైడ్రేట్ కాకుండా కొబ్బరినీరు తాగాలి.
- నిత్యం ఒక అరటిపండు అయినా తినాలి.
- వంటల్లో తప్పనిసరిగా వెల్లుల్లి ఉండేలా చూడాలి.
- అప్పుడప్పుడు ఉల్లిపాయ రసం సేవించాలి.
ఇవి కూడా చదవండి..
ఫైజాబాద్ రైల్వేస్టేషన్ ఇక అయోధ్య కంటోన్మెంట్!
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా ఇస్కాన్ ప్రదర్శనలు
యాపిల్ దశ దిశను మార్చిన తొలి ఐపాడ్
జమ్ములో హోం మంత్రి పర్యటన.. అమరుల కుటుంబాలకు పరామర్శ
ఇ-వ్యర్థాల నుంచి బంగారు నాణేలు.. బ్రిటన్ రాయల్ మింట్ చొరవ
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

