Apple iPod : యాపిల్ దశ దిశను మార్చిన తొలి ఐపాడ్
Today History : ప్రముఖ సంస్థ యాపిల్ తన మొట్టమొదటి ఐపాడ్‌ను 20 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున ఆవిష్కరించింది. ఈ బుల్లి ఐపాడ్.. మొత్తం యాపిల్ సంస్థ ..

(Apple iPod) ప్రముఖ సంస్థ యాపిల్ తన మొట్టమొదటి ఐపాడ్‌ను 20 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున ఆవిష్కరించింది. ఈ బుల్లి ఐపాడ్.. మొత్తం యాపిల్ సంస్థ దశ, దిశనే మార్చేసిందని చెప్పవచ్చు. మొబైల్ మార్కెట్లో యాపిల్ ప్రయాణం ఇక్కడి నుంచే ప్రారంభమై.. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా ఎదిగింది.
స్టీవ్ జాబ్స్ 1997 లో యాపిల్ సీఈఓగా తిరిగి వచ్చారు. డెస్క్‌టాప్ మార్కెట్‌ను మైక్రోసాఫ్ట్ ఆక్రమించింది. ఈ సమయంలో యాపిల్‌కి చెప్పుకోవడానికి ఎటువంటి ఉత్పత్తులు లేవు. అలాగే, దివాలా అంచున ఉన్నది. అటువంటి పరిస్థితిలో ఒక కొత్త పరికరాన్ని తీసుకురావడం ద్వారా మార్కెట్ దృష్టికి ఆకర్శించాలని యాపిల్ సంస్థ భావించింది. అప్పట్లో హ్యాండ్‌హెల్డ్ ఎంపీ3 ప్లేయర్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. దీని దీటుగా పోర్టబుల్ ఎంపీ3 ప్లేయర్‌ను తయారు చేయాలని స్టీవ్ జాబ్స్ భావించారు. మ్యాక్ కంప్యూటర్లను ఉపయోగించే వ్యక్తులను ఆకర్షించడానికి ఐట్యూన్స్తో లింక్ చేయాలని ఉద్యోగులు సూచించారు. ఆరు వారాల్లో మూడు ఉత్పత్తి నమూనాలు రూపొందించి ఒకదాన్ని మరింత అధునాతనంగా తయారుచేయడానికి సిద్ధమయ్యారు.
ఈ ఉత్పత్తికి పేరు పెట్టాలని ఫ్రీలాన్స్ రైటర్ విన్నీ షికోను కోరగా.. అతడు దీనికి ఐపాడ్ అని పేరు పెట్టాడు. ఈ పేరు స్టార్ట్రాక్ నుంచి ప్రేరణగా తీసుకున్నారు. మొదటి ఐపాడ్ నవంబర్ 2001లో పంపిణీ చేశారు. కేవలం ఆరేండ్లలోనే 100 మిలియన్లకు పైగా ఐపాడ్లను విక్రయించడాన్ని బట్టి దానికెంత క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అనంతరకాంలో ఐప్యాడ్లు, ఐవాచ్, ఐఫోన్.. సంబంధిత విభాగాల్లో ఆధిపత్యం చలాయిస్తూ వస్తున్నది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2013: సరిహద్దు రక్షణ ఒప్పందంపై సంతకం చేయాలని నిర్ణయించిన చైనా-భారతదేశం
2011: టర్కీలోని వాన్ ప్రావిన్స్‌లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించి 582 మంది దుర్మరణం
2002: మాస్కోలో దాదాపు 700 మంది కళాకారులను బందీలుగా తీసుకున్న చెచెన్ వేర్పాటువాదులు
2001: అంగారక గ్రహం చుట్టూ తిరగడం ప్రారంభించిన నాసా మార్స్ ఒడిస్సీ అంతరిక్ష నౌక
1998: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తన మొదటి బ్యాంకును జాతీయం చేసిన జపాన్
1989: సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన 33 ఏండ్ల తర్వాత గణతంత్ర రాజ్యంగా అవతరించిన హంగరీ
1954: నాటో సమావేశంలో చేరిన పశ్చిమ జర్మనీ
1946: మొదటిసారి న్యూయార్క్‌లో సమావేశమైన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ
1943: సింగపూర్‌లోని ఆజాద్ హింద్ ఫౌజ్‌లో ఝాన్సీ రాణి బ్రిగేడ్‌ను స్థాపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్
1940 : ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు పీలే జననం
ఇవి కూడా చదవండి..
జమ్ములో హోం మంత్రి పర్యటన.. అమరుల కుటుంబాలకు పరామర్శ
ఆర్యన్ ఖాన్ తర్వాత.. ఇప్పుడు ‘స్టార్ కిడ్స్’పై ఎన్సీబీ కన్ను
ఇ-వ్యర్థాల నుంచి బంగారు నాణేలు.. బ్రిటన్ రాయల్ మింట్ చొరవ
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

