ISKCON : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా ఇస్కాన్ ప్రదర్శనలు
ISKCON : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా శనివారం నాడు ‘ఇస్కాన్’ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీతోపాటు...

ఢాకా : (ISKCON) బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా శనివారం నాడు ‘ఇస్కాన్’ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీతోపాటు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని ఇస్కాన్ కోరింది. బంగ్లాదేశ్‌లో దాడులకు నిరసనగా దాదాపు 150 దేశాల్లోని ఇస్కాన్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ప్రార్థన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. కోల్‌కతాతో పాటు అనేక ఇతర ప్రదేశాల్లో నిరసనలు చేపట్టారు. కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం వద్ద కూడా ఇస్కాన్ సభ్యులు నిరసన తెలిపారు. ఇటీవల బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ దేవాలయంపై జరిగిన దాడిలో ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల పట్ల కోల్‌కతాలోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ విచారం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ నుంచి వస్తున్న సమాచారంతో ఎంతో బాధకు గురయ్యామని చెప్పారు. ఇస్కాన్ ఎల్లప్పుడూ నోఖాలి (బంగ్లాదేశ్‌లో ఓ వర్గం) ప్రజలకు అనుకూలంగానే ఉన్నదన్నారు. న్యూయార్క్, మాస్కో, రష్యా, ఆస్ట్రేలియా, కెనడాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చెపట్టినట్లు తెలిపారు. 13 నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగిన దాడుల్లో దుర్గా మంటపాలు ధ్వంసమవగా, హిందువులకు చెందిన దాదాపు 66 ఇండ్లపై దాడులు జరిపినట్లు సమాచారం. ఇలాఉండగా, బంగ్లాదేశ్‌లో హింస మొదలవడానికి ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఇక్బాల్ హుస్సేన్‌ను కాక్స్ బజార్లో గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొమిల్లాలోని దుర్గాపూజ పండల్లో ఖురాన్ కాపీ ఉంచినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
యాపిల్ దశ దిశను మార్చిన తొలి ఐపాడ్
జమ్ములో హోం మంత్రి పర్యటన.. అమరుల కుటుంబాలకు పరామర్శ
ఆర్యన్ ఖాన్ తర్వాత.. ఇప్పుడు ‘స్టార్ కిడ్స్’పై ఎన్సీబీ కన్ను
ఇ-వ్యర్థాల నుంచి బంగారు నాణేలు.. బ్రిటన్ రాయల్ మింట్ చొరవ
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

