Amarinder Singh : పంజాబ్ రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా కెప్టెన్
Amarinder Singh : కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన తర్వాత పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీరు మారిపోయింది. వ్యవసాయ చట్టాల విషయంలో...

చండీగఢ్ : (Amarinder Singh) కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన తర్వాత పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీరు మారిపోయింది. వ్యవసాయ చట్టాల విషయంలో, రైతుల ఉద్యమాన్ని ముగించడానికి చురుకుగా మారారు. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గురువారం భేటీ అయి చర్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కెప్టెన్ వెంట 20-25 మంది ప్రతినిధుల బృందం కూడా ఉండనున్నది. రైతుల ఆందోళనను ముగించి క్రెడిట్ కొట్టేయడం ద్వారా పంజాబ్ ఎన్నికల్లో కీలక వ్యక్తిగా మారాలన్నది కెప్టెన్ ప్రణాళికగా కనిపిస్తున్నది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపి తద్వారా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలన్నది కెప్టెన్ ఎత్తుగడగా కనిపిస్తున్నది. ఇందుకు అమిత్‌షా సాయం తీసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి పదవిని వీడిన తర్వాత అమిత్‌షాతో ఇప్పటికే కెప్టెన్ అమరీందర్‌సింగ్ భేటీ అయ్యారు.
త్వరలో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు కెప్టెన్ అమరీందర్‌సింగ్ మీడియా ఎదుట ప్రకటించారు. అయితే, పార్టీ పేరు, గుర్తుకు సంబంధించిన విషయాలు తర్వాత వెల్లడిస్తానని చెప్పారు. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసి, క్లియరెన్స్ వచ్చిన తర్వాత పేరు, ఎన్నికల గుర్తు గురించి చెప్తానన్నారు. కొత్త పార్టీ స్థాపన ప్రకటన తర్వాత రైతుల ఆందోళనను ముగించేందుకు కెప్టెన్ అమరీందర్ చురుకుగా మారారు. గురువారం అమిత్ షాతో భేటీ అయి రైతుల ఆందోళనకు ఫుల్స్టాప్ పెట్టించాలన్న ఆలోచనలో ఉన్నారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 117 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. ఇందుకోసం ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటాం లేదంటే సొంత పార్టీ ప్రాతిపదికన మేమే పోరాడతామన్నారు. సిద్ధూ పోటీ చేసే అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపి ఓడించేందుకు ప్లాన్ చేస్తామని చెప్పారు. సిద్ధూ సీన్లోకి వచ్చాక కాంగ్రెస్‌కు ఆదరణ 24 శాతం తగ్గిపోయిందని కెప్టెన్ ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో తానిచ్చిన అన్ని హామీలను పూర్తి చేశానని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఇది లైవ్ బ్యాక్టీరియా క్లియర్ ఫొటో.. వెల్లడించిన యూకే శాస్త్రవేత్తలు
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

