Saudi Arabia : పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా చేయూత.. 300 కోట్ల ఆర్థిక సాయం ప్రకటన
Saudi Arabia : దివాలా అంచున ఉన్న పాకిస్తాన్‌ను ఆదుకునేందుకు సౌదీ అరేబియా ముందుకొచ్చింది. దాదాపు రూ.300 కోట్ల ఆర్థిక సాయం...

ఇస్లామాబాద్ : (Saudi Arabia) దివాలా అంచున ఉన్న పాకిస్తాన్‌ను ఆదుకునేందుకు సౌదీ అరేబియా ముందుకొచ్చింది. దాదాపు రూ.300 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. పేదరికం అంచున ఉన్న పాకిస్థాన్‌కు సౌదీ గొప్ప ఊరటనిచ్చింది. విదేశీ నిల్వలతో నగదు కొరత ఉన్న దేశానికి సహాయం చేయడానికి పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్‌లో 3 బిలియన్ డాలర్లను డిపాజిట్ చేస్తున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. సౌదీ ఫండ్ ఫర్ డెవలప్మెంట్ మంగళవారం ఈ ప్రకటన చేసినట్లు జియో న్యూస్ రిపోర్ట్ వెల్లడించింది. సౌదీ అరేబియా నుంచి అందిన సహాయాన్ని పాకిస్తాన్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి, ఇంధన శాఖ మంత్రి అహ్మద్ అజార్ ధ్రువీకరించారు. సౌదీ అరేబియా ఆర్థిక సాయం మునిగిపోతున్న పాకిస్తాన్‌కు బయటపడేసేందుకు ఉపయోగకరంగా ఉంటుందని పాక్ ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
చమురు ఉత్పత్తుల వాణిజ్యానికి ఆర్థిక సహాయం చేసేందుకు సౌదీ అరేబియా ఈ ఏడాది పాకిస్తాన్‌కు 1.2 బిలియన్ డాలర్లు (రూ.120 కోట్లు) అందించనున్నట్లు నివేదిక పేర్కొన్నది. పాకిస్తాన్ రూపాయి ధర నిరంతరం పతనం అవుతుండటంతో నవంబర్ 1 నుంచి పెట్రోల్ ధరలు మరోసారి పెరుగనున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం హయాంలో 70 ఏండ్లలో దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నది. నెయ్యి, నూనె, పిండి, చికెన్ ధరలు చారిత్రాత్మక స్థాయికి చేరుకోగా.. ఆహారం ధరలు రెట్టింపయ్యాయి. నయా పాకిస్తాన్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్లో పరిస్థితులను పూర్తిగా చెడగొట్టాడని అక్కడి నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం వేగంగా పేదరికం వైపు పయనిస్తున్న దశలో సౌదీ అరేబియా పొరుగు దేశాన్ని ఆదుకునేందుకు ముందుకు రావడం పట్ల సౌదీపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.
ఇవి కూడా చదవండి..
ఆఫ్ఘనిస్తాన్‌లోనే ఇంకా 450 మంది అమెరికన్లు.. పెంటగాన్ వెల్లడి
పంజాబ్ రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా కెప్టెన్
ఇది లైవ్ బ్యాక్టీరియా క్లియర్ ఫొటో.. వెల్లడించిన యూకే శాస్త్రవేత్తలు
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

