Venkaiah Naidu : ఉన్నత విద్యలో బహుముఖ విధానాలు అవసరం: వెంకయ్యనాయుడు
Venkaiah Naidu : అత్యుత్తమ పరిశోధన ఫలితాలు సాధించేందుకు ఉన్నతవిద్యలో బహుముఖ వ్యూహాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి...

పనజీ : (Venkaiah Naidu) అత్యుత్తమ పరిశోధన ఫలితాలు సాధించేందుకు ఉన్నతవిద్యలో బహుముఖ వ్యూహాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం విద్యార్థులు కొన్ని విషయాలను నిర్బంధంగా నేర్చుకునేలా ఒత్తిడి చేయడం కంటే, నచ్చిన విషయాలను ఎంచుకుని వాటిలో మరింత ప్రగతి సాధించేందుకు ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. గోవా పనజీలో సంత్ సోహిరోబనాత్ ఆంబియే ప్రభుత్వ కళాశాల భవనం నూతన ప్రాంగణాన్ని గురువారం ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని నిలబెట్టే దిశగా ‘వాణిజ్యం’ కీలకమైన అంశమని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ-కామర్స్ రంగంలో గణనీయమైన మార్పులు కనబడుతున్నాయని, ఈ దిశగా మరిన్ని మార్పులకు ఉన్నత విద్యాసంస్థలు ముందడుగేయాలని సూచించారు. ఐటీ రంగంలో పురోగతికి అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలు ఎంతముఖ్యమో, ప్రకృతి పరిరక్షణలో భాగంగా సీతాకోక చిలుకలతో కూడిన ఓ ఉద్యానవాన్ని ఏర్పాటుచేయడం కూడా అంతే ప్రాధాన్యతాంశమన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో గోవాలోని సంప్రదాయ సంగీత కళాకారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం ఎంతో ఆకట్టుకున్నది. కళాకారులను ప్రత్యేకంగా స్టేజి మీదకు పిలిపించి వారిని వెంకయ్యనాయుడు అభినందించారు. ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్ళై, ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్, గోవా ఉపముఖ్యమంత్రి బాబు అసగావ్కర్, గోవా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిమళ్ రాయ్, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వడోదరలో ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్ ప్రారంభం
చైనా హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష నిజమే సుమా: అమెరికా
మోదీ బలం అర్థం చేసుకుంటేనే.. బీజేపీని ఓడించొచ్చు: ప్రశాంత్ కిషోర్
ఈ పరీక్షతో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించొచ్చు.. ఎడిన్బర్గ్ పరిశోధకుల అభివృద్ధి
మడగాస్కర్ అడవుల్లో బుల్లి ఊసరవెల్లి
బ్రిటన్‌లో కొత్త ఫుడ్ ట్రెండ్ 5 : 2 .. వెజిటేరియన్ వైపు మొగ్గు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

