Prashant Kishor : మోదీ బలం అర్థం చేసుకుంటేనే.. బీజేపీని ఓడించొచ్చు: ప్రశాంత్ కిషోర్
Prashant Kishor : గోవాలో పర్యటిస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీపై విచిత్రమైన కామెంట్లు చేశారు. రానున్న మరికొన్నేండ్లపాటు ...

పనాజీ : (Prashant Kishor) గోవాలో పర్యటిస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీపై విచిత్రమైన కామెంట్లు చేశారు. రానున్న మరికొన్నేండ్లపాటు బీజేపీ అతిపెద్ద శక్తిగా నిలుస్తుందని, బీజేపీ గెలిచినా, ఓడినా రాజకీయాలకు కేంద్రంగా ఉంటుందన్నారు. నరేంద్ర మోదీ బలం తెల్సుకుంటేనే ఆయన్ని ఓడించగలరని చెప్పారు. ప్రజలు మోదీని ప్రధాని పీఠం నుంచి తోసేసే రోజు కోసం రాహుల్‌గాంధీ ఎదురుచూస్తున్నారని చురకలంటించారు. మోదీ అధికారంలో ఉన్నంత వరకే బీజేపీ బలంగా ఉంటుందన్న బ్రమల్లో రాహుల్ ఉన్నారని చమత్కరించారు. మూడింట ఒక వంతు ఓట్లు మాత్రమే బీజేపీ వస్తుంటే.. మిగతా రెండు వంతుల ఓట్లను 10-15 పార్టీలు పొందుతున్నాయని, దీనికి కాంగ్రెస్ బలహీనతే ప్రధాన కారణమన్నారు.
భారతీయ జనతా పార్టీ రాబోయే దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో ప్రధాన శక్తిగా కొనసాగుతుందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. మొదటి 40 ఏండ్లు భారత రాజకీయాల్లో కాంగ్రెస్ కేంద్రంగా ఉన్నట్లే.. బీజేపీ ఓడిపోయినా, గెలిచినా కూడా రాజకీయాలకు కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. నరేంద్ర మోదీ బలాన్ని అర్థం చేసుకోకపోతే, అతన్ని ఓడించలేరని స్పష్టం చేశారు. చాలా మంది తమ శక్తిని అర్థం చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించరని చెప్పారు. మోదీ పాపులారిటీకి కారణం ఏంటో అర్థం చేసుకుంటే గానీ, ఆయన్ను ఓడించడానికి కౌంటర్ దొరుకుతుందని కాంగ్రెస్ నేతలకు సూచించారు.
మోదీపై ప్రజలు కోపంతో ఉన్నారని, ఆయన్ను బయటకు పంపిస్తారనే ఉచ్చులో ఎప్పుడూ పడొద్దని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. బహుశా మోదీని పారద్రోలవచ్చేమో కానీ, బీజేపీ ఎక్కడికీ వెళ్లదన్నారు. రాబోయే కొన్ని దశాబ్దాలు బీజేపీతో పోరాడాల్సి ఉంటుందని, అందుకు మానసికంగా, శారీరకంగా కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ.. మోదీ అధికారంలో ఉన్నంత వరకు మాత్రమే బీజేపీ బలంగా ఉంటుందన్న భ్రమలో రాహుల్ ఉన్నారని, బహుశా ప్రజలు మోదీని అధికారం నుంచి త్రోసిపుచ్చే సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు రాహుల్ భావిస్తున్నాడని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఈ పరీక్షతో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించొచ్చు.. ఎడిన్బర్గ్ పరిశోధకుల అభివృద్ధి
మడగాస్కర్ అడవుల్లో బుల్లి ఊసరవెల్లి
బ్రిటన్‌లో కొత్త ఫుడ్ ట్రెండ్ 5 : 2 .. వెజిటేరియన్ వైపు మొగ్గు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

