Venkaiah Naidu : అన్నదాతల అభివృద్ధితోనే దేశాభివృద్ధి : వెంకయ్యనాయుడు
Venkaiah Naidu : అన్నదాతల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ...

విజయవాడ : (Venkaiah Naidu) అన్నదాతల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ముందు వరుస పోరాట యోధులతో సమానంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రైతులు చేసిన కృషి మరచిపోలేనిదన్నారు. రైతుల దృష్టిలో వ్యవసాయం అంటే వృత్తి కాదని, సేద్యాన్నే తమ జీవితంగా భావిస్తారని తెలిపారు. శనివారం విజయవాడలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగిన ముప్పవరపు ఫౌండేషన్–రైతునేస్తం అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వెంకయ్యనాయుడు.. పలువురు రైతులతో పాటు సేద్యానికి దన్నుగా నిలుస్తున్న శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, పాత్రికేయులకు అవార్డులు బహూకరించారు. 17 ఏండ్లుగా రైతునేస్తం మాసపత్రిక ద్వారా అన్నదాతకు చేదోడుగా నిలుస్తూ ఏటా ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వెంకటేశ్వర రావును ప్రత్యేకంగా అభినందించారు.
వ్యవసాయ రంగంలో శాస్త్రీయ విధానాలను ప్రవేశపెట్టిన ఘనత భారతీయులకే దక్కుతుందని వెంకయ్యనాయుడు చెప్పారు. భారతీయ వాజ్ఞ్మయంలో కృషి విజ్ఞాన ప్రస్తావన ఉందన్నారు. మట్టిలోని సారాన్ని మనుగడకు ఉపయోగపడే ఆహారంగా మార్చే పవిత్ర యజ్ఞమే వ్యవసాయమన్న ఆయన.. పర్యావరణ హిత వ్యవసాయ విధానాలపై రైతుల దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. సేంద్రీయ ఉత్పత్తులకు ప్రస్తుతం మంచి ధర లభిస్తోందని చెప్పారు. వ్యవసాయం అంటే పంటలు పండించడమే కాదు.. పర్యావరణాన్ని కూడా కాపాడుకోవడం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, రైతునేస్తం వ్యవస్థాపకులు యడ్లపల్లి వెంకటేశ్వర రావు, భారతీయ కిసాన్ సంఘ్ దక్షిణ భారత బాధ్యులు కుమార స్వామితోపాటు పలువురు రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పాత్రికేయులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అవినీతి, కుంభకోణానికి పర్యాయపదం కాంగ్రెస్ : అమిత్‌షా
ఆ రైతులకు అండగా టీటీడీ : చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య
సమాజ్‌వాది పార్టీలో చేరిన బీఎస్పీ, బీజేపీ ఎమ్మెల్యేలు
అనారోగ్యంతో భార్య మృతి.. తట్టుకోలేక భర్త కన్నుమూత
తిరుమల ఘాట్‌లో ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రారంభించనున్న సీఎం జగన్
బద్వేలులో ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

