మళ్లీ విశ్వ నాయకుడిగా మోదీ.. అమెరికా సర్వే వెల్లడి
భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వనాయకుడిగా ఎంపికయ్యారు. గ్లోబల లీడర్స్ ర్యాంకింగ్ కోసం అమెరికాకు చెందిన ఓ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికా, బ్రిటన్‌తో పాటు 13 దేశాల నాయకులను తోసిరాజని మోదీ అగ్రస్థానంలో నిలిచారు

వాషింగ్టన్ డీసీ : భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వనాయకుడిగా ఎంపికయ్యారు. గ్లోబల లీడర్స్ ర్యాంకింగ్ కోసం అమెరికాకు చెందిన ఓ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికా, బ్రిటన్‌తో పాటు 13 దేశాల నాయకులను తోసిరాజని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. మోదీకి వచ్చిన జనాదరణ 100 లో 66 శాతంగా ఉన్నది. అయితే, గత ఏడాది లభించిన ప్రజాదరణ ఈసారి 20 శాతం తక్కువగా ఉండటం విశేషం. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్, భారతదేశంలో దాని చెడు ప్రభావాల తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణ చెక్కుచెదరకుండా ఉన్నదని ఈ సర్వే వెల్లడిస్తున్నది.
అమెరికన్ డాటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో గ్లోబల్ లీడర్స్ ర్యాంకింగ్‌లో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ సర్వేలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు సహా 13 దేశాల నాయకులను చేర్చారు. ఈ సర్వేలో భారతదేశానికి చెందిన 2,126 మందిని చేర్చారు. ఇందులో 28 శాతం మంది మోదీ ప్రజాదరణను అంగీకరించలేదు. సర్వేలో కేవలం 3 దేశాల నాయకుల రేటింగ్ 60 శాతం పైన ఉండటం విశేషం. సర్వేలో మోదీ తర్వాత ఇటాలియన్ ప్రధానమంత్రి మారియో ద్రాగి ఉన్నారు. ఆయన రేటింగ్ 65 శాతం. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ మూడవ స్థానంలో 63 శాతం రేటింగ్‌తో ఉన్నారు.
ఈ నెల 7న మోదీ చేసిన ప్రసంగంతో ఆయన రేటింగ్ శాతం పెరగడానికి దోహదపడిందని పలువురు నిపుణులు వాదిస్తున్నారు. దేశంలోని 18 ఏండ్ల వయసు పైబడిన వారందరికీ ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్లు అందజేస్తామని మోదీ చెప్పడంతో ఆయనకు ప్రజల్లో కొంత ఆదరణ పెరిగిందని చెప్పవచ్చునని వారంటున్నారు.
విశ్వనాయకుల రేటింగ్..
- నరేంద్ర మోదీ (భారత్) 66%
- మారియో ద్రాగి (ఇటలీ) 65%
- లోపెజ్ ఒబ్రాడోర్ (మెక్సికో) 63%
- స్కాట్ మోరిసన్ (ఆస్ట్రేలియా) 54%
- ఏంజెలా మెర్కెల్ (జర్మనీ) 53%
- జో బిడెన్ (యూఎస్) 53%
- జస్టిన్ ట్రూడో (కెనడా) 48%
- బోరిస్ జాన్సన్ (యూకే) 44%
- మూన్ జే-ఇన్ (దక్షిణ కొరియా) 37%
- పెడ్రో శాంచెజ్ (స్పెయిన్) 36%
- జైర్ బోల్సోనారో (బ్రెజిల్) 35%
- ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (ఫ్రాన్స్) 35%
- యోషిహిడే సుగా (జపాన్) 29%
ఇవి కూడా చదవండి..
కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా అమెరికా మరో అడుగు
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా గెలుపుపై గంగూలీ.. ఏం చెప్పాడంటే..?
కిడ్నీ క్యాన్సర్ ఎలా వస్తుందంటే..?
ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్లీ గురూ..!
మూడో అతిపెద్ద వజ్రం దొరికింది.. ఎక్కడంటే..?
యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాకరణ
అంత్యక్రియల వేళ తల్లి మాట విని లేచిన కొడుకు
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

