‘ది బీస్ట్’.. బైడెన్ ప్రయాణించే కారు విశేషాలు ఇవే..

వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం అనంతరం అధికార వాహనం ‘ది బీస్ట్’లో ప్రయాణిస్తారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన సరికొత్త కాడిలాక్ ఆధారిత మోడల్ లిమోను 2018లో ట్రంప్ హయాంలో ఆ దేశ సీక్రెట్ సర్వీస్‌లో ప్రవేశపెట్టారు. 2009 నుంచి అమెరికా అధ్యక్షులు వినియోగించిన పాత బీస్ట్ స్థానంలో సరికొత్తగా చేరిన ప్రపంచంలోనే ప్రత్యేకమైన బీస్ట్ 2.0 కారు విశేషాలు ఇవే..
1) బీస్ట్ 2.0ను తయారు చేసిన జనరల్ మెటార్స్ (జీఎం) సీక్రెట్ సర్వీస్‌కు రెండు వాహనాలు సమకూర్చింది.
2) కాడిలాక్ ఎస్కాలా కాన్సెప్ట్ కారు మాదిరిగా కొత్త కాడిలాక్ లిమో కారు గ్రిల్‌తోపాటు సాధారణ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
3) లిమోకు సొంత విమానం ఉన్నది. అమెరికా అధ్యక్షుడు వెళ్లే ప్రతిచోటుకు సి -17 గ్లోబ్ మాస్టర్ కార్గో విమానం ద్వారా ఈ కారును తరలిస్తారు.
4) రెండు వాహనాలు ఒకే మాదిరిగా ఉంటాయి. భారీగా ఆయుధాలు కలిగి ఉంటాయి. 5 అంగుళాల మందపాటి గాజు, 8 అంగుళాల మందపాటి తలుపులు (వాణిజ్య విమానం తలుపుల బరువు మాదిరిగా) ఉంటాయి. ఈ వాహనాలను టైటానియం, సిరామిక్స్, బాంబుప్రూఫ్ ప్లేట్ ఉపయోగించి నిర్మించారు.
5) పాత బీస్ట్ కారు 14,000 నుండి 20,000 పౌండ్ల మధ్య బరువు ఉండగా, కొత్త బీస్ట్ తేలికైనది.
6) ఉపగ్రహ ఫోన్, న్యూక్లియర్ కోడ్లతో పాటు రన్-ఫ్లాట్ టైర్లు, నైట్ విజన్ గేర్, ఆక్సిజన్ సరఫరా వంటి భద్రతా చర్యలను కలిగి ఉంటుంది. ఇది ఫ్రంట్ బంపర్ నుండి గ్యాస్ షెల్స్‌ను ఫైర్ చేస్తుంది.
7) బరువు, పరిమాణం కారణంగా 5 లీటర్ డీజిల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. పాత బీస్ట్ 3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని నివేదికల ద్వారా తెలుస్తున్నది.
8) ఈ కారుకు సీక్రెట్ సర్వీస్‌లో ఒక కోడ్ ఉంది. అయితే అది ‘ది బీస్ట్’ కాదు. దీన్ని అంతర్గతంగా ‘స్టేజ్‌కోచ్’ అని వ్యవహరిస్తారు.
9) దీనిలో పొందుపరిచిన ఆయుధాల గురించి సీక్రెట్ సర్వీస్ వివరించలేదు. అయితే డ్రైవర్ వద్ద షాట్‌గన్ ఉంటుంది.
10) అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ రక్తంతోపాటు డీఫిబ్రిలేటర్, ఇతర అత్యవసర వస్తువులను ఇందులో ఉంచుతారు.
అయితే ఇవన్నీ బహిరంగంగా తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే. వాస్తవానికి ఈ బీస్ట్ కారులో ఏమి ఉన్నాయి అన్నది సీక్రెట్ సర్వీస్, కొంత మంది జీఎం ఇంజినీర్లకు తప్ప మరెవరికీ తెలియదు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- మమతపై సువెందు పోటీ.. 57 మందితో బీజేపీ తొలి జాబితా
- ఆర్ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 66 లక్షలు సీజ్..
- మళ్లీ మోగింది ‘ప్రైవసీ’ గంట: వాట్సాప్ న్యూ రిమైండర్లు
- అదే జరిగితే వందేళ్లు వెనక్కి : మంత్రి హరీశ్‌రావు
- అనుష్క తర్వాతి సినిమాలో హీరో ఆ కుర్రాడా?
- టీఎంసీలో టికెట్ నిరాకరణ.. బీజేపీలో చేరుతానంటున్న సొనాలీ గుహా
- 14 ఏండ్ల బాలుడిపై మహిళ లైంగికదాడి.. ప్రస్తుతం గర్భవతి
- మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఒకవైపు ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుక.. మరోవైపు ఇద్దరు హత్య
- మీరు ఎదిగి పదిమందికి సాయపడాలి : ఎమ్మెల్సీ కవిత