Viral Video | కుమారుడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న జంట.. నెటిజన్లు ఫైర్
Viral Video | ఇటీవలే కొందరు రోడ్డుపై ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ప్రమాదాలబారిన పడుతున్నారు. తాజాగా ఓ జంట తమ కుమారుడితో కలిసి స్కూటీపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ (Viral Video) అవుతోంది.
Viral Video | ఇటీవలే కొందరు రోడ్డుపై ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ప్రమాదాలబారిన పడుతున్నారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ జంట తమ కుమారుడితో కలిసి స్కూటీపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ (Viral Video) అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
బెంగళూరుకు చెందిన ఓ జంట (Bengaluru couple) నగరంలోని రద్దీగా ఉండే వైట్‌ఫీల్డ్ (Whitefield) ప్రాంతంలో తమ స్కూటీపై వెళ్తున్నారు. అయితే, ఆ సమయంలో దంపతులిద్దరూ సీటుపై కూర్చోగా.. కుమారుడు మాత్రం ఫుట్‌రెస్ట్ (footrest)పై నిలబడి కనిపించాడు. రద్దీ రహదారిపై రాత్రి సమయంలో వారు ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కనిపించారు. ఇది చూసిన అటుగా వెళ్తున్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
వీడియో చూసిన నెటిజన్లు దంపతులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కుమారుడిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆ మహిళను కఠినంగా శిక్షించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను అభ్యర్థిస్తున్నారు. మరోవైపు ఈ వీడియోపై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు (Bengaluru Traffic Police) కూడా స్పందించారు. ఘటనపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Idiots on the road 🤬@blrcitytraffic @BlrCityPolice please take action. pic.twitter.com/tAN9BxTHiS
— 𝗟 𝗼 𝗹 𝗹 𝘂 𝗯 𝗲 𝗲 (@Lollubee) April 15, 2024
Also Read..
Surya Tilak | బాలరాముడికి సూర్యతిలకం.. లైవ్ ద్వారా వీక్షించిన ప్రధాని మోదీ
Arvind Kejriwal | ఢిల్లీలో నీటి సమస్య.. జైల్లో ఉన్న కేజ్రీవాల్‌కు గవర్నర్ సక్సేనా ఓపెన్ లెటర్
MK Stalin | మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశం 200 ఏళ్ల వెనక్కి వెళుతుంది : సీఎం స్టాలిన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

