నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యదు వంశీ దర్శకుడు. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్‌వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫ్రెండ్‌షిప్‌డే కానుకగా ఆగస్ట్ 9న విడుదల కానుంది. న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలనే తలంపుతో ఎక్కువమంది కొత్తవాళ్లతో తీసిన సినిమా ఇదని, యువతతోపాటు, కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చే సినిమా ఇదని నిహారిక నమ్మకం వ్యక్తం చేశారు. ఇందులో 11మంది హీరోలను, 4గురు హీరోయిన్లను పరిచయం చేస్తున్నామని, స్నేహం, భావోద్వేగాలు, ప్రేమ, పల్లెటూరి రాజకీయాలు, యువత సంఘర్షణ.. ఈ అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయని దర్శకుడు చెప్పారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాను నిర్మించినందుకు ఆనందంగా ఉందని నిర్మాతల్లో ఒకరైన జయలక్ష్మి ఆనందం వెలిబుచ్చారు.