KTR | 80 వేల కోట్లతోనే కాళేశ్వరం సాకారం.. మూసీ సుందరీకరణకు 1.5 లక్షల కోట్లా?: కేటీఆర్
మూసీ ప్రాజెక్టు సుందరీకరణకు రూ. 1.5 లక్షల కోట్లా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పుట్టినగడ్డను విస్మరించి మూసీ సుందరీకరణపై దృష్టిపెట్టడం వెనుకున్న మతలబు ఏమిటని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
- ప్రాజెక్టుపై అంత మమకారం ఎందుకో?
- మూడింతలు పెరిగిన ప్రాజెక్టు అంచనాలు కాంగ్రెస్ ప్రభుత్వ ధన దాహానికి సాక్ష్యాలు
- తెరవెనుక బాగోతం ప్రజలు గమనిస్తున్నరు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఎందుకింత మకువ? చివరి దశలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కనపెట్టి, మూసీ సుందరీకరణపైనే ఎందుకు ఎక్కువ ఆసక్తిని చూపుతున్నది. థేమ్స్ నదిలాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏమిటి?
-కేటీఆర్
KTR | హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): మూసీ ప్రాజెక్టు సుందరీకరణకు రూ. 1.5 లక్షల కోట్లా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పుట్టినగడ్డను విస్మరించి మూసీ సుందరీకరణపై దృష్టిపెట్టడం వెనుకున్న మతలబు ఏమిటని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు రూ. 50 వేల కోట్లు అని ఒకసారి, రూ. 70 వేల కోట్లు అని ఇంకోసారి చెప్పారని, ఇప్పుడేమో రూ. 1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం చెప్తుండడంలో ఆంత ర్యం ఏమిటని నిలదీశారు.
తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లయితేనే గల్లీ నుంచి ఢిల్లీదాకా కాంగ్రెస్ గగ్గోలు పెట్టిందని, మరి సుందరీకరణకే రూ. 1.5 లక్ష ల కోట్లా? అని నిప్పులు చెరిగారు. ‘ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందురు? నిల్వ ఉంచే టీఎంసీలెన్ని? సాగులోకి వచ్చే ఎకరాలెన్ని? పెరిగే పంటల దిగుబడి ఎంత? తీర్చే పారిశ్రామిక అవసరాలెంత? కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లెన్ని?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మకువ? అని ప్రశ్నించారు. చివరి దశలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కనపెట్టి, మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగం అని మండిపడ్డారు. లండన్‌లోని థేమ్స్ నదిలాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏమిటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ధనదాహానికి నిదర్శనం
మూసీ సుందరీకరణకు మూడింతలు పెంచిన అంచనాలే కాంగ్రెస్ ధనదాహానాకి సజీవ సాక్ష్యమని కేటీఆర్ ఉదహరించారు. మూసీ ప్రాజెక్టును చేపట్టాల్సిందే, సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే పని షురూ చేస్తే సహించబోమని తేల్చిచెప్పారు. తట్టెడు మన్ను తీయకముందే కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే సహించేది లేదని హెచ్చరించారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరిట బ్యాక్ డోర్లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని, కుంభకోణాల కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెడుతుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ. 3,866 కోట్లతో వందశాతం సీవరేజ్ ట్రీట్మెంట్ పూర్తిచేసిందని గుర్తుచేశారు. మూసీనది పునర్నిర్మాణం, సుందరీకరణ అభివృద్ధి ప్రణాళికను రూపొందించామని, అందుకు రూ. రూ.16,634 కోట్ల అంచనాలు రూపొందించామని (పశ్చిమవైపు (మంచిరేవుల) ఓఆర్ఆర్ నుంచి తూర్పు వైపు (ప్రతాపసింగారం) ఓఆర్ఆర్ వరకు ఎక్స్‌ప్రెస్ వేతో సహా), అయితే ఆ మొత్తాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ 10 రెట్లు పెంచాలని ఎలా నిర్ణయించుకున్నదని కేటీఆర్ ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

