Nipah Virus | కేరళలో నిఫా కలకలం.. రిస్క్‌లో మరో 60 మంది
కరోనా వైరస్ కన్నా చాలా ప్రమాదకరమైందిగా భావిస్తున్న ‘నిఫా వైరస్' కేరళలో పంజా విసురుతున్నది. వైరస్ బారినపడి వెంటిలేటర్‌పై ఉన్న 14 ఏండ్ల బాలుడు కోజికోడ్‌లో గుండె పోటుతో మరణించాడని కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆదివారం ప్రకటించారు.
- వైరస్ సోకిన బాలుడి మృతి
Nipah Virus | తిరువనంతపురం: కరోనా వైరస్ కన్నా చాలా ప్రమాదకరమైందిగా భావిస్తున్న ‘నిఫా వైరస్’ కేరళలో పంజా విసురుతున్నది. వైరస్ బారినపడి వెంటిలేటర్‌పై ఉన్న 14 ఏండ్ల బాలుడు కోజికోడ్‌లో గుండె పోటుతో మరణించాడని కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆదివారం ప్రకటించారు. ప్రభుత్వ అధికారులు మలప్పురం జిల్లా అంతటా హై-అలర్ట్ ప్రకటించారు. బాలుడితో కాంటాక్ట్ అయిన 240 మందిని క్వారంటైన్లో ఉంచినట్టు తెలిసింది. వైరస్ వ్యాప్తి ప్రభావిత గ్రామాల్లో లాక్డౌన్ విధించారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని మంత్రి సూచించారు. బాలుడితో కాంటాక్ట్ ఉన్న వారిలో 60 మందిని హై-రిస్క్ క్యాటగిరీగా గుర్తించిన జిల్లా అధికారులు తగిన చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
ఏమిటీ వైరస్?
- ఈ వైరస్‌ను తొలిసారి 1999లో గుర్తించారు. ఇది ‘ఫ్రూట్ బ్యాట్’ అనే గబ్బిలాల్లో ఉంటుంది. వాటి నుంచి ఇతర జంతువులకు, మనుషులకు సోకుతుంది.
- వైరస్ ఉన్న గబ్బిలాలతో మనుషులు కాంటాక్ట్ అయినా, వాటి లాలాజలం లేదా అవి వాలిన ఆహార పదార్థాల (పండ్లు) ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది.
- ఒకసారి మనుషులకు సోకితే.. వారి నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది.
లక్షణాలు
- వైరస్ సోకిన వాళ్లలో తొలుత జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- సరైన చికిత్స అందకపోతే, శ్వాస సంబంధిత సమస్యలు, నిమోనియా ఏర్పడతాయి. రోగి మెదడు దెబ్బ తిని కోమాలోకి వెళ్లిపోతాడు.
చికిత్స
నిఫా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీ వైరల్ వైద్య చికిత్స ఏదీ ఇప్పటివరకూ లేదు. వైరస్ సోకిన రోగిని ఐసొలేషన్‌లో ఉంచుతూ, రోగ లక్షణాలను అనుసరించి వైద్య చికిత్స అందిస్తుంటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

