MK Stalin | మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశం 200 ఏళ్ల వెనక్కి వెళుతుంది : సీఎం స్టాలిన్
MK Stalin | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu Chief Minister), డీఎంకే (DMK) అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
MK Stalin | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu Chief Minister), డీఎంకే (DMK) అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి వెళుతుందని వ్యాఖ్యానించారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే అభ్యర్థి టీఆర్ బాలుకు మద్దతుగా శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ర్యాలీలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ‘కేంద్రంలో ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుంది. చరిత్ర తిరగరాస్తుంది. అదే విధంగా సైన్స్ కూడా వెనక్కి వెళుతుంది. అప్పుడు మూఢనమ్మకాలతో కూడిన కథలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం ఆర్ఎస్ఎస్ నియమాలతో నిండిపోతుంది. అలా జరగకూడదంటే.. దీనికి వ్యతిరేకంగా ఓటు వేయడం ఒక్కటే ఆయుధం’ అని వ్యాఖ్యానించారు.
బీజేపీకి ఓటేస్తే తమిళనాడు శత్రువుకు వేసినట్లే అని స్టాలిన్ దుయ్యబట్టారు. ‘బీజేపీకి ఓటేస్తే తమిళనాడు శత్రువులకు వేసినట్లే. అన్నాడీఎంకేకు వేసిన ఓటు రాష్ట్ర ద్రోహులకు వేసినట్లే’ అని వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకే, బీజేపీ పార్టీలు సహజ మిత్రపక్షాలు అని పిలిచేవారు, కానీ ఇప్పుడు అవి విడిపోయినట్లుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ అవసరమైతే బీజేపీకి మద్దతు ఇస్తారా అని మీడియా ఏఐఏడీఎంకేను ప్రశ్నించినప్పుడు.. ఎడప్పాడి కె. పళనిస్వామి అన్నాడీఎంకే మద్దతు ఇవ్వదని చెప్పలేదని, ‘వెయిట్ అండ్ సీ’ అని సమాధానం చెప్పినట్లు స్టాలిన్ గుర్తు చేశారు. ఏఐఏడీఎంకే పార్టీ బీజేపీకి ఎప్పటికీ వ్యతిరేకం కాదని.. ఆ పార్టీకి ఓటేస్తే కమలం పార్టీకి వేసినట్లే అని ముఖ్యమంత్రి స్టాలిన్ దుయ్యబట్టారు.
Also Read..
Ram Navami | రామ్‌లల్లాకు దివ్యాభిషేకం.. అయోధ్యలో ఘనంగా నవమి వేడుకలు
Song | ఆకట్టుకున్న ‘గోవిందా.. గోవిందా’ పాట .. కాంగ్రెస్ పాలనపై సెటైరికల్ సాంగ్
CNAP | మొబైల్ మోసాల కట్టడికి కొత్త వ్యవస్థ.. డిస్ప్లేలో నంబర్‌తోపాటు పేరు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

