డెహ్రాడూన్: కొందరు భక్తులను పూజారులు, ఆలయ సిబ్బంది కర్రలతో కొట్టారు. దీంతో దాడి నుంచి తప్పించుకునేందుకు భక్తులు పరుగులు తీశారు. చివరకు పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Priests Assaults Devotees) ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌కు చెందిన కొందరు వ్యక్తులు, సిద్ధపీఠ్లోని దక్షిణ్ కాళీ మందిర్‌ను సందర్శించారు. అయితే వారు బైక్‌లపై అక్కడకు రావడంతో ఆలయంలో పార్కింగ్ అంశంపై వివాదం చెలరేగింది.
కాగా, వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. దీంతో పూజారులు, ఆలయ సిబ్బంది కలిసి ఆ భక్తులపై దాడి చేశారు. కర్రలతో వారిని కొట్టారు. తప్పించుకునేందుకు కొందరు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆలయం సమీపంలో వాహనాలపై వెళ్తున్న వారు కూడా ఈ దాడి వల్ల ఇబ్బందిపడ్డారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దారు.
అయితే ఈ ఘర్షణకు సంబంధించి ఎవరి నుంచి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు పూజారులు, ఆలయ సిబ్బంది కలిసి కర్రలతో భక్తులను దారుణంగా కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
हरिद्वार के सिद्धपीठ दक्षिण काली मंदिर में यूपी के सहारनपुर के श्रद्धालुओं और पुजारियों के बीच जमकर लाठी डंडे चले। विवाद पार्किंग की पर्ची काटने को लेकर हुआ। पुजारी और कर्मचारियों ने श्रद्धालुओं को दौड़ा-दौड़ाकर पीटा। वीडियो हुआ वायरल। pic.twitter.com/377hBgsByl
— iMayankofficial 🇮🇳 (@imayankindian) April 15, 2024