ఏథెన్స్: ఓ విషాద ఘటన ఓ జంట జీవితాన్ని మార్చేసింది. దశాబ్ధాల క్రితం నాడు ఫ్రీజ్ చేసిన పిండం(Frozen Embryo)తో.. 54 ఏళ్ల వయసులో ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన గ్రీస్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గత అక్టోబర్‌లో ఆ మహిళకు చెందిన 21 ఏళ్ల కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ దుఖాన్ని భరించలేక.. ఆ జంట మరో బిడ్డకు జన్మనివ్వాలని ప్లాన్ చేసింది. అయితే 22 ఏళ్ల క్రితం నాటి పిండంతో మరో బేబీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. వాస్తవానికి గ్రీస్ ప్రభుత్వ నియమావళి ప్రకారం 54 ఏళ్ల వయసులో ఐవీ పద్ధతిలో తల్లి అయ్యేందుకు అనుమతులు లేవు. కానీ ఆ గడువుకు మరో 2 నెలల సమయం మాత్రమే ఉండడంతో.. 54 ఏళ్ల క్రిస్టినా రాప్తీ టెలిపి తన భర్తతో కలిసి కీలక నిర్ణయం తీసుకున్నది.
22 ఏళ్ల క్రితం ఫ్రీజింగ్ చేసిన పిండంతో బిడ్డకు జన్మనివ్వాని నిర్ణయించుకున్నది. ఎట్టకేలకు అనుమతి పొందిన క్రిస్టినా.. గత బుధవారం రాజధాని ఏథెన్స్లో 3.49 కిలోల బరువున్న బిడ్డకు జన్మనిచ్చింది. అయితే 22 క్రితం ఫ్రీజ్ చేసిన పిండంతో గర్భం దాల్చడం గమనార్హం. ఇది చాలా సుదీర్ఘమైన సమయం. గత ఏడాది అమెరికాలోని ఓహియోలో ఓ జంట 30 ఏళ్ల క్రితం ఫ్రీజ్ చేసిన పిండంతో బేబీకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ జంట గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.