Bandla Ganesh | చంద్రబాబు తల్లిదండ్రుల సమాధుల వద్ద బండ్ల గణేష్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
Bandla Ganesh | ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తన అభిమానాన్ని చాటుకున్నారు. చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెకు వెళ్లిన బండ్ల గణేష్.. అక్కడ సీఎం తల్లిదండ్రులు ఖర్జూరపు నాయుడు, అమ్మనమ్మ సమాధులను సందర్శించి నివాళులర్పించారు.
Bandla Ganesh | ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తన అభిమానాన్ని చాటుకున్నారు. చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెకు వెళ్లిన బండ్ల గణేష్.. అక్కడ సీఎం తల్లిదండ్రులు ఖర్జూరపు నాయుడు, అమ్మనమ్మ సమాధులను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం వేదికగా పంచుకున్నారు. చంద్రబాబు వంటి మహానాయకుడిని దేశానికి, రాష్ట్రానికి అందించిన ఆయన తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ బండ్ల గణేష్ భావోద్వేగంగా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబును ‘వాటర్‌మ్యాన్ ఆఫ్ ఏపీ’ గా అభివర్ణిస్తూ ఆయనపై తనకున్న అభిమానాన్ని మరోసారి వ్యక్తం చేశారు.
నారావారిపల్లె పర్యటన సందర్భంగా చంద్రబాబు తల్లిదండ్రుల సమాధులను దర్శించుకున్న క్షణాలను గుర్తుచేసుకుంటూ బండ్ల గణేష్ ఎమోషనల్‌గా స్పందించారు. ఆ సమాధులను తాకిన సమయంలో తన మనసులో ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగిందని తెలిపారు. చంద్రబాబు వంటి గొప్ప నాయకుడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని, అదే సమయంలో అలాంటి మహనీయులను తల్లిదండ్రులుగా పొందిన చంద్రబాబు కూడా అదృష్టవంతుడేనని తన మనసులో అనిపించిందని బండ్ల గణేష్ పేర్కొన్నారు.దేశం కోసం, రాష్ట్రం కోసం నిరంతరం శ్రమించే నాయకుడిని ఈ ప్రపంచానికి అందించిన ఆ తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. ఆ మహనీయుల ఆశీస్సులు, ఏడుకొండలవాడి కృప ఎల్లప్పుడూ చంద్రబాబు, ఆయన కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
బండ్ల గణేష్‌కు జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల కాలంలో ఆయన చంద్రబాబు, నారా కుటుంబంపై కూడా తన అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, భువనేశ్వరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కూడా బండ్ల గణేష్ ప్రత్యేకంగా స్పందించారు. తమ కుటుంబం ఎన్నో కష్టకాలాలను ఎదుర్కొన్న సమయంలో చంద్రబాబు దంపతులు అండగా నిలిచారని, ఆపదలో తమ కుటుంబానికి సహాయం చేశారని ఆయన గతంలో పేర్కొన్నారు. వారు చేసిన మేలును ఎప్పటికీ మరిచిపోలేనని, వారి ఆశీస్సులు తమ జీవితాలకు గొప్ప బలమని భావోద్వేగంగా తెలిపారు.ఇక చంద్రబాబు, భువనేశ్వరి పుట్టినరోజుల సందర్భంగా కూడా బండ్ల గణేష్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా తరచూ సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు కుటుంబంపై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
ఈరోజు నారావారిపల్లిని సందర్శించి, వాటర్‌మ్యాన్ ఆఫ్ AP, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి జన్మనిచ్చిన మహనీయులు శ్రీ ఖర్జూరపు నాయుడు గారు, శ్రీమతి అమ్మనమ్మ గారి సమాధులను దర్శించుకుని, ఆ సమాధులను తాకిన క్షణంలో నా మనసులో ఒక తీయని అనుభూతి కలిగింది.
“ఎంత గొప్ప బిడ్డను కన్నారమ్మా…… pic.twitter.com/08XVSR8hrN
— BANDLA GANESH. (@ganeshbandla) September 11, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

