Poor Man Donated Egg | విరాళంగా గుడ్డు ఇచ్చిన పేదవాడు.. వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే?
Poor Man Donated Egg | మసీదు నిర్మాణం కోసం ఒక పేదవాడు గుడ్డును విరాళంగా ఇచ్చాడు. ఎంతో ప్రేమతో దానిని స్వీకరించిన కమిటీ సభ్యులు వేలం పాట నిర్వహించారు. సుమారు ఐదు రుపాయలు విలువ చేసే ఆ గుడ్డు వేలం పాటలో లక్షల్లో అమ్ముడుపోయింది.
శ్రీనగర్: మసీదు నిర్మాణం కోసం ఒక పేదవాడు గుడ్డును విరాళంగా ఇచ్చాడు. (Poor Man Donated Egg) ఎంతో ప్రేమతో దానిని స్వీకరించిన కమిటీ సభ్యులు వేలం పాట నిర్వహించారు. సుమారు ఐదు రుపాయలు విలువ చేసే ఆ గుడ్డు వేలం పాటలో లక్షల్లో అమ్ముడుపోయింది. జమ్ముకశ్మీర్లోని సోపోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మల్పోరా గ్రామంలో మసీదు నిర్మాణం కోసం విరాళాల సేకరణ చేపట్టారు. ఒక పేద ముస్లిం ఒక గుడ్డును విరాళంగా ఇచ్చాడు. దీనిని స్వీకరించిన కమిటీ సభ్యులు మిగతా వస్తువులతో పాటు వేలం పాట నిర్వహించారు.
కాగా, పేద వ్యక్తి విరాళంగా ఇచ్చిన ఆ గుడ్డును వేలం పాటలో దక్కించుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. తొలుత వందలు, వేల రూపాయాల్లో దక్కించుకున్న కొందరు ప్రతిసారి దానిని తిరిగి కమిటీ సభ్యులకు అందజేశారు. ఇలా పలువురి చేతులు మారిన ఆ గుడ్డుకు పలుసార్లు వేలంపాట నిర్వహించారు. చివరకు ఒక వ్యక్తి రూ.70,000కు ఆ గుడ్డును దక్కించుకున్నాడు.
మరోవైపు ఆ గుడ్డుకు నిర్వహించిన అన్ని వేలం పాటల ద్వారా మొత్తం రూ.2,26,000 వచ్చాయని కమిటీ సభ్యులు తెలిపారు. దీంతో ఆ గుడ్డు వేలం పాటను ముగించినట్లు చెప్పారు. అయితే ఐదు రూపాయల విలువైన గుడ్డు వేలం పాటలో లక్షల్లో నిధులు సమకూర్చిన విషయం తెలుసుకుని స్థానికులు ఆశ్చర్యపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

