– కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేస్తే ఊరుకోమని హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 17 : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సోమవారం ధర్నాలు, నిరసనలు చేపట్టారు. అన్ని తాసీల్దార్ కార్యాలయాల ఎదుట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పేదల పెండ్లీళ్లకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్ఠాత్మకం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని చూడడం దుర్మార్గపు చర్య అని నాయకులు దుయ్యబట్టారు. వెంటనే పేద కుటుంబాలను ఆదుకునే కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు
కొత్తగూడెం నియోజకవర్గంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పిలుపుతో కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవీపల్లి, పాల్వంచ, జూలూరుపాడు మండలాల్లో భారీ ఎత్తున నాయకులు పాల్గొని నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతామహాలక్ష్మి. బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు అనుదీప్. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దామోదర్. లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు కోటి వెంకటేశ్వర్లు. సుజాతనగర్ మండల అధ్యక్షుడు లావుడియా సత్యనారాయణ, పాల్వంచ మండలం అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్. జగన్, కార్పొరేటర్లు సింధు తపస్వి, గుణ చరిత, మధు, చంద్, రాంబాబు, సాగర్, గ్రామ పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.