Satish Kumar Voditela | కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏతులు, ఎగవేతలు, కోతలు, కూల్చివేతలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆరోపించారు. హైకోర్టును సాకుగా చూపుతూ లక్షలాది నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించకుండా కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకాలను ఉద్దేశపూర్వకంగా ఎత్తివేయాలన్న ఆలోచనను నిరసిస్తూ హుస్నాబాద్ పట్టణంలో ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న ఫీజు రీయింబర్స్మెంట్ .. నేడు కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ మొన్న లక్షలాది మంది తెలంగాణ విద్యార్థుల భవిష్యత్‌ను ఆగం చేసింది. నేడు వేలాది ఆడబిడ్డల జీవితాలకు అన్యాయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ సర్కారు చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ సార్ పేదల కన్నీళ్లు తుడిచేందుకు పథకాలు అమలు చేస్తే… కాంగ్రెస్ సర్కారు ప్రజలను కష్టాల పాలు చేసేందుకు పథకాలను కట్ చేస్తోందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పథకాలు అమలు చేస్తే – కాంగ్రెస్ సర్కారు హామీలకే పరిమితమైందన్నారు.
ఎవరో అడ్వకేట్ విజయ్ గోపాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారంట… ఈ చేత కాని కాంగ్రెస్ ప్రభుత్వం జులై 8 నుంచి ఆగస్టు 7 వరకు కౌంటర్ దాఖలు చేయలేదు.ఇప్పుడు కోర్టు కల్యాణలక్ష్మి పథకాన్ని అమలును హైకోర్టు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. కళ్యాణ లక్షి పథకాన్ని చట్టబద్ధత లేదు, కేవలం జీవోల మీద అమలు చేస్తున్నారని అంటున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15-3, ఆర్టికల్ 21 ప్రకారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం చట్టబద్దమైనదే. కల్యాణలక్ష్మి ,షాదీ ముబారక్ పథకాలను కేసీఆర్ గొప్ప హృదయంతో ప్రవేశపెట్టారు. పేద ఇంటి ఆడపిల్ల పెళ్లి ఆర్థిక కష్టాలతో ఆగిపోకూడదని కేసీఆర్ ఆర్థిక సాయం అందించారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మొదట 51 వేలు తర్వాత 75 వేలు, నేడు 1,00,116 ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 లక్షల మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకం అందించడం జరిగింది. కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకం ద్వారా నగదును నేరుగా లబ్ధిదారులకు చెక్కుల ద్వారా అందించడం జరుగుతోంది. ఒక లంబాడీ ఆడబిడ్డ పెళ్లి కోసం దాచిన డబ్బు వారి ఇల్లు కాలిపోయినప్పుడు మంటల్లో ఆ డబ్బు కాలిపోతే నాడు కేసీఆర్ చలించి ఆ లంబాడీ ఆడబిడ్డ పెళ్లి దగ్గరుండి జరిపించారు.. ఆ లంబాడీ కుటుంబం పడ్డ బాధ ఏ కుటుంబం పడకూడదని… ప్రతీ పేదింటి ఆడబిడ్డకు మేనమామగా… కేసీఆర్ మానవత్వంతో ఆలోచించి సాయం అందించారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో కేసీఆర్ 1,00,116 ఇస్తే నేను 1,00,116తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి దాదాపు 34 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో ఏ ఒక్క కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం కాదు కదా… గ్రాము బంగారం ఇచ్చిన పాపాన పోలేదన్నారు.
ఇప్పటికే 420 హామీలు – 6 గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థులకు ఇచ్చే ఫీజుల రీయంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం ఆపివేసింది. నేడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని నిలిపి వేసే కుట్ర చేసింది చూస్తోంది. పేదల తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. పేదబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం అందే వరకు పోరాడుతామన్నారు.
కోర్టులను అడ్డుపెట్టుకొని పేదల పొట్టకొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. తెలంగాణ ప్రజల కోసం రోడ్ల మీద పోరాటల నుంచి న్యాయస్థానాల్లో సైతం పోరాడుతాం.పేదింటి ఆడబిడ్డకు సాయం చేసే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాల్సిందే. పేద బిడ్డల హక్కు కల్యాణలక్ష్మి .ఆ పథకాన్ని అమలు చేసే వరకు కొట్లాడుతామన్నారు.