మొక్కలు నాటి సంరక్షిద్దాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మహబూబ్‌నగర్ : ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని బైపాస్ రహదారిపై బహుళ వరుసలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాబోయే వారం పది రోజుల్లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రితో హరిత హారం కింద జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరాలను వెల్లడించారు.
జిల్లాలో మొక్కలు నాటడం, నర్సరీల పెంపకతో పాటు 99 శాతం వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవటమే కాక మహిళా సంఘాలు 2 కోట్ల విత్తన బంతులు తయారు చేస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఇల్లు కట్టే ముందు తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. మున్సిపాలిటీ కూడా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటేలా చూడాలన్నారు.
పట్టణంలో ఎన్నో పార్కులను ఏర్పాటు చేశామని, వాటిని అందంగా తీర్చి దిద్దాలన్నారు. అదేవిధంగా బై పాస్ చుట్టూ, మధ్యలో కూడా మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అలాగే జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్థానిక సంస్థలకు అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, కౌన్సిలర్ వనజ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
వరంగల్‌లో హైటెక్స్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ అనుమతులు
రైతువేదికలు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

