కాబూల్ : తమ దేశానికి చెందిన వారిని తరలించేందుకు ఇటలీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన విమానంలో (Italy Flight) మంటలు చెలరేగాయి. కాబూల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలను గుర్తించారు. విమానాన్ని నిలుపుదల చేసేందుకే తాలిబాన్ కాల్పులకు తెగబడిందన్న సమాచారం అందింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో కాల్పుల ఘటనలో ఎవరూ గాయపడలేదని ప్రాథమిక నివేదికలు తెలిపాయి.ఈ విమానంలో అధికారులు, జర్నలిస్టులను ఇటలీకి తరలిస్తుండగా ఈ కాల్పుల ఘటన జరిగింది.
ఇది జరిగిన కొద్దిసేపటికి హమీద్ కర్జాయ్ విమానాశ్రయం ప్రధాన గేటు వద్ద భారీ పేలుడు సంభవించింది. అమెరికాకు చెందిన విమానాలు తమ దేశస్థుల తరలింపునకు విమానాశ్రయంలో వేచి ఉన్నాయి. ఈ పేలుడును అమెరికాలోని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ ధ్రువీకరించారు. ఎంతమంది గాయపడ్డారు అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని, త్వరలో మరిన్ని విశేషాలు అందిస్తానని జాన్ కిర్బీ చెప్పారు. కాబూల్ విమానాశ్రయానికి ఉగ్ర ముప్పు పొంచి ఉన్నదని ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాలు హెచ్చరించాయి.
అమెరికా, ఇండియా, బ్రిటన్, కెనడా తదితర దేశాలు తాలిబాన్ యుద్ధప్రాతిపదికన దేశ పగ్గాలను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి తమ జాతీయులను, ఆఫ్ఘన్ వాసులను తరలించే కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంపై అత్యవసర చర్చలు జరిపిన జీ-7 దేశాలు, ఆగస్టు 31 తర్వాత కాబూల్ నుంచి వెళ్లిపోవాలనుకునే వారికి తాలిబాన్ సురక్షితమైన మార్గానికి హామీ ఇవ్వాలని ఏకగ్రీవంగా అంగీకరించాయి. కాబూల్ నుంచి అమెరికా ఇప్పటివరకు 82,000 మందికి పైగా ప్రజలను తీసుకెళ్లినట్లు ఆ దేశ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు.
తాలిబాన్ డిప్యూటీ చీఫ్ సంధానకర్త షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ని కలిసినట్లు జర్మనీ ప్రతినిధి మార్కస్ పోట్జెల్ తెలిపారు. చట్టపరమైన డాక్యుమెంట్లు కలిగిన ఆఫ్ఘన్లకు వాణిజ్య విమానాల్లో ప్రయాణించే అవకాశం ఆగస్టు 31 తర్వాత కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారని పోట్జెల్ చెప్పారు.
రాణె తల నరికి తెస్తే 51 లక్షల రివార్డ్ : విశ్వ హిందూ సేన
సాంకేతిక అంతరాల్లేని అంతర్జాల విద్య రావాలి: వెంకయ్యనాయుడు
ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అజయ్ కుమార్
7,200 ఏండ్ల క్రితం మహిళ శరీరంలో డీఎన్ఏ గుర్తింపు
త్వరలో గూగుల్ పే ఆన్లైన్లో ఫిక్స్డ్ డిపాజిట్స్
సుప్రీంకోర్టుకు 9 మంది కొత్త జడ్జీలు
జైలులో కొత్త రకం శిక్ష వేశారు : అలెక్సీ నవాల్నీ
3 వేలకు వాటర్ బాటిల్.. 7 వేలకు ప్లేట్ అన్నం.. ఇదీ అక్కడి పరిస్థితి..!
బ్రిటీష్ వారిని దోచుకున్న విప్లవకారులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..