భారతదేశాన్ని దాస్య శృంఖాలల నుంచి విముక్తి కల్పించేందుకు ఎందరో మహానుభావులు.. ఎన్నో రోజులపాటు ఉద్యమాలు కొనసాగించారు. వీరిలో ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని చెప్పడానికి వీలులేదు. చాలా ప్రాంతాల్లో చాలా విధాలుగా ఉద్యమాలు చేసి చివరకు మన దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టారు. వీరిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది విప్లవకారుల గురించి. బ్రిటీష్ పాలకులకు వెన్నులో వణుకు పుట్టించి ప్రాణాలను తృణప్రాయంగా వదులుకున్నవారెందరో ఉన్నారు. ఇలాంటి ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి కోల్‌కతాలో 1914 లో సరిగ్గా ఇదే రోజున జరిగింది. బ్రిటీష్ పాలకుల నుంచి మౌజర్ పిస్టల్లతోపాటు 46 వేల రౌండ్ల బుల్లెట్లను విప్లవకారులు ఎత్తుకెళ్లి (Culcutta Loot)నోళ్లు తెరిచేలా చేశారు.
భారతదేశంలోని హిందూ-ముస్లింలలో బేధాభిప్రాయాలు రావాలన్న కుట్రతో బ్రిటీషర్లు బెంగాల్ ప్రాంతాన్ని 1905 లో విభజించారు. ఈ నిర్ణయాన్ని భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. 1911 లో బ్రిటీష్ పాలకులు తమ రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చారు. దీని వెనుక ప్రధాన కారణం బెంగాల్లో పెరుగుతున్న తిరుగుబాటు.
1914 లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై.. బ్రిటిషర్ల దృష్టి యుద్ధం వైపు మళ్లింది. విప్లవకారులకు తిరుగుబాటు చేయడానికి ఇది గొప్ప అవకాశం. అయితే, అందుకు ఆయుధాలు అవసరం అని భావించి బ్రిటీష్ వారి నుంచే ఆయుధాలు ఎత్తుకెళ్లడానికి ప్లాన్ వేశారు. రోడా కంపెనీ నుంచి భారతదేశంలోని ఆంగ్లేయులకు తుపాకులు, ఆయుధాలు సరఫరా అయ్యేది.
మౌజర్ పిస్టల్స్ కోల్‌కతాలోని గోదాంకు వస్తున్నాయని తెలుసుకున్న దేశభక్త విప్లవకారులు.. మూకుమ్మడిగా దాడి చేసి 202 బాక్సుల్లో ప్యాక్ చేసి ఉంచిన 50 మౌజర్ పిస్టల్లతోపాటు 46 వేల రౌండ్ల బుల్లెట్లను ఎత్తుకుపోయారు. అనంతరం అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యమాలు చేస్తున్న విప్లవకారులకు చేరవేశారు. ఇది బ్రిటీషర్లకు గుణపాఠంగా, కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుకల్పించింది.
1910: మాసిడోనియాలోని స్కోప్జేలో మదర్ థెరిస్సా జననం
2017: గుర్మీత్ రామ్ రహీమ్‌పై కోర్టు నిర్ణయం తర్వాత హర్యానాలో జరిగిన నిరసనల్లో 31 మంది దుర్మరణం
1972: జర్మనీ మ్యూనిచ్‌లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలు
1955: సత్యజిత్ రే నిర్మించిన చిత్రం పథేర్ పాంచాలి విడుదల
1883: ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలి 36,000 మంది దుర్మరణం
1303 : చిత్తోర్‌గఢ్‌ను వశపరుచుకున్న అల్లావుద్దీన్ ఖిల్జీ
గుండె వైఫల్యం ప్రమాదమా..? ఇలా గట్టెక్కొచ్చు..!
నిన్నటి వరకు మంత్రి.. నేడేమో పిజ్జా డెలివరీ బాయ్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..